లైఫ్ స్టైల్: పిల్లల ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు..?

Divya
సాధారణంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పెద్దలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇకపోతే పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి పిల్లలు అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఇక అలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వంటింట్లో ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఎటువంటి సమస్యలనైనా దూరం చేయవచ్చు .  శరీరంలో ఎముకలు ఎంతటి కీలక పాత్ర వహిస్తాయో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల ఎముకలు చాలా సున్నితంగా,  పెలుసుగా ఉంటాయి. మరి పిల్లల ఎముకలు దృఢంగా మారాలి అంటే పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.
రోజువారి డైట్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చడం వల్ల పిల్లల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇకపోతే పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలలో మొదటిది ఖర్జూరాలు.. ఖర్జూరాల యొక్క ప్రయోజనాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఇవి చక్కటి రుచితో పాటు ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి ఖర్జూరాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో సందేహం లేదు.
ఇక పెద్దలకు మాత్రమే కాదు పిల్లల ఎముకలు దృఢంగా మారాలి అంటే ప్రతిరోజు ఖర్జూరాలను పిల్లలకు అందివ్వాలి. ముఖ్యంగా ఎండిన ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల వారి శరీరంలో ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి మరిన్ని పోషకాలు లభిస్తాయి.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి . వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు.
ఇక వీటితోపాటు మఖానాలు , పాలు, పెరుగు , బాదం, జున్ను,  ఆకుకూరలు , చేపలు , గుడ్లు,  చియా సీడ్స్ వంటివి పిల్లల డైట్ లో చేర్చితే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వారు ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారి తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇకపై ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: