లైఫ్ స్టైల్: ఈ ఉత్పత్తులను నేరుగా ముఖంపై వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

Divya
ఇటీవల కాలంలో కొంతమంది అంతర్జాలంలో శోధించిన తర్వాత కొన్ని ఉత్పత్తులను నేరుగా ముఖంపై వాడుతున్నారు. ఇక వీటి వల్ల చర్మానికి ఎంత హానికరమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి వాటిలో కొన్ని ఉత్పత్తులను నేరుగా ముఖం మీద వాడితే కొన్ని చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయట. ఇక వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం.
నిమ్మకాయ:
సాధారణంగా నిమ్మకాయను ఫేస్ ప్యాక్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే విటమిన్ సి ఎక్కువగా లభించే ఈ నిమ్మకాయను నేరుగా ముఖంపై ఉపయోగించకూడదు. చాలామందికి నిమ్మరసం లేదా నిమ్మకాయ లోపలి భాగాన్ని చర్మానికి అప్లై చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయలో సిట్రస్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మానికి హాని కలిగించవచ్చు. అంతేకాదు సూర్యరశ్మి వల్ల చర్మానికి తీవ్రమైన నష్టం కూడా కలుగుతుంది. రంగు మారిపోయే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారి చికాకుగా అనిపించవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్:
గత కొన్ని సంవత్సరాలుగా బరువు తగ్గడంలో ప్రథమంగా ఉపయోగపడే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖంపై నేరుగా అప్లై చేయకూడదు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండడం వల్ల చర్మంపై దురదలు, మంట, చర్మం ఎర్రగా మారి పోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
వెజిటబుల్ ఆయిల్ :
ముఖానికి  నూనె రాసుకోవడం అనేది చాలా మంచి అలవాటు. కానీ కొన్ని రకాల నూనెలను అసలు ముఖం పైన రాయవద్దు. డెర్మటాలజీ లో వెజిటబుల్ ఆయిల్ వాడకం నిషిద్ధం. వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
దాల్చిన చెక్క:
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి అయితే దీనిని ముఖం మీద నేరుగా ఉపయోగించడం వల్ల బొబ్బలు, చికాకు, ఇన్ఫెక్షన్ వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఉత్పత్తులను నేరుగా ముఖంపై అప్లై చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: