అసిడీటీ, అల్సర్ ఈజీగా తగ్గే టిప్స్!

Purushottham Vinay
ఇక మారుతోన్న జీవనశైలి కారణంగా అనారోగ్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది కూడా జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.అసిడిటీ ఇంకా అల్సర్లు ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారిపోయాయి. ఫాస్ట్‌ఫుడ్‌ ఇంకా అలాగే జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జీర్ణ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువగా వస్తున్నాయి.ఇక ఇలాంటి సమస్య ఎదురైన వెంటనే చాలా మంది కూడా ఎక్కువగా ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఇక ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? ఉదర సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టే అలాంటి కొన్ని నేచురల్‌ టిప్స్‌ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక కొందరికి తిన్న వెంటనే కడుపులో బాగా మంటగా ఉంటుంది. అలాంటి వారు చల్లని పాలు తాగితే వెంటనే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ పాలలోని క్యాల్షియం కడుపులో విడుదలయ్యే ఆమ్లాల తీవ్రతను తగ్గిస్తుంది.


ఇంకా అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ వాము ఇంకా జీలకర్రను గ్లాసులో నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం పూట లేవగానే పరగడపున ఆ నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది.అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తగ్గాలంటే గులాబీ రెక్కలు వేసి మరిగించిన పాలను కనుక రోజూ తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే కడపులో మంటగా ఉన్న వాళ్లు ముల్లంగా రసం కడుపు మంట తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా చేస్తుంది.ఇంకా అలాగే కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను నీటిలో కలిపి తాగితే వెంటనే మీకు ఉపశమనం అనేది లభిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులను పాటించండి. అల్సర్ ఇంకా అలాగే కడుపులో మంట సమస్యలని చాలా ఈజీగా మీరు తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: