ఊరగాయ : ఎక్కువ తింటే నష్టాలు తప్పవు!

Purushottham Vinay
ఇక మనదేశంలో ఊరగాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మనం తీసుకునే ఆహారంలో ఊరగాయ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. దీంతో తెలుగువారికి ఊరగాయ అంటే చాలా ఇష్టం.ఇక ఈ నేపథ్యంలోనే ఊరగాయ తినడం మనకు ఓ అలవాటుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊరగాయను నోరూరించే విధంగా ఇళ్లల్లో తయారు చేసుకుంటారు. ఏడాదంతా కూడా ఊరగాయ తింటూ బాగా ఆస్వాదిస్తారు. అది ఆహారంలో తీసుకుంటేనే చాలా పరిపూర్ణం అవుతుంది. లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు మనకు అనిపిస్తుంది.అయితే ఊరగాయతో ఆరోగ్యానికి చాలా చేటు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో వాడే అధిక నూనె ఇంకా అలాగే ఉప్పు వల్ల మన ఆరోగ్యం బాగా దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకేు ఊరగాయను మితంగానే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. కానీ కొంతమంది అయితే మొత్తం ఆహారాన్ని ఊరగాయతోనే తినేందుకు చాలా ఇష్టపడుతుంటారు. కానీ అలాంటి వారికి ప్రమాదకరమే.


ఇక ఊరగాయ వాడే పురుషుల్లో సంతానోత్పత్తి ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఊరగాయను సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కానీ దీన్ని ఇష్టారాజ్యంగా పెద్ద మొత్తంలో తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని తెలిసిందే. మన ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఊరగాయను చూస్తే ఊరుకునే వీలు కాదు కానీ జిహ్వ చాపల్యం ని చంపుకోవాల్సిందే. ఊరగాయను ఎక్కువగా తీసుకోకుండా కొంచెంగా తీసుకుని ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఊరగాయ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఊరగాయకి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.ఇక ఇంట్లో పప్పు చేసినా, ఏ కూర వండినా చివరకు ఆవకాయ తీసుకోవాల్సిందే. ఆహారంలో ఊరగాయ ఉంటేనే మన మనసు కుదుటపడుతుంది. లేదంటే ఏదో లోటు కనిపిస్తుంది. అందుకే మన ఆహారంలో ఊరగాయ ఉంచుకునేందుకు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. తెలుగు వారి ఇళ్లల్లో అయితే ఊరగాయ ఉంచుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలు కూడా పడతారు. ఇక దాన్ని తయారు చేసేందుకు కూడా ఎంత శ్రమ అయినా కూడా భరించి వాటిని పెడుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: