గొంతు నొప్పి : క్షణాల్లో తగ్గే ఈజీ టిప్స్!

Purushottham Vinay
ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు బాగా పెరిగిపోతుంది. ఇక ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు ఇంకా జబ్బులు రావడం సహజమే.అయితే ప్రధానంగా చాలా మందికి కూడా సీజనల్ జబ్బులు  అనేవి చాలా రకాలుగా బాగా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు ఇంకా అలాగే జ్వరం ఇంకా గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఇంకా అలాగే శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడే సింపుల్ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.గొంతు సమస్య వల్ల బాగా బాధపడే వారు ఒక్కసారి మన ఇంట్లో ఉండే వంటగది వైపు ఒక లుక్ వేయండి.


ఇక మన వంట గదిలో లభించే సహజ పదార్థాలతోనే ఈ సమస్యను చాలా ఈజీగా నయం చేసుకోవచ్చు.ఇక మిరియాలను బాగా దంచి మరిగించిన పాలల్లో వేసి తాగడం వల్ల గొంతునొప్పి సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌ ఇంకా అలాగే యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్‌లను పోగొడతాయి. జలుబు కూడా ఈజీగా తగ్గుతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇంకా అలాగే అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడి వేడిగా తాగాలి.ఇంకా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత దీంతో చిక్కని అల్లం రసం అనేది వస్తుంది. ఇక అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి.దీంతో గొంతు నొప్పి అనేది అసలు క్షణాల్లో తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: