లైఫ్ స్టైల్: ఈ టిప్స్ ని ఎప్పుడైనా పాటించారా..?

Divya
ప్రతి ఒక్కరు తమ పనులలో చాలా బిజీగా ఉంటారు. ఇక ఆఫీసు పనులలలో పడితే ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెళుతూ ఉంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా వండుకొని ఆహారపదార్ధాలను హెల్తీ గా ఉంచుకోవడం ముఖ్యం. అయితే కాయగూరలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలంటే మనం ఇలా చేస్తే సరిపోతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.
1). బిర్యానీ రైస్ వండేటప్పుడు అందులోకి కాస్త నెయ్యి వేయడం వల్ల అన్నం చాలా పొడిపొడిగా ఉంటుంది.
2). ముఖ్యంగా వంటగదిలో ఈగలు వంటివి రాకుండా ఉండాలంటే కాస్త వెనిగర్ కొన్ని వేడినీళ్లలో వేసి.. అందులోకి కాస్త ఉప్పు కలిపి కిచెన్ రూమ్ ను శుభ్రం చేయడం వల్ల ఇలాంటివి రావు.
3). పప్పు చేసేటప్పుడు త్వరగా ఉడకాలంటే అందులోకి కాస్త కొబ్బరి ముక్క వేసినట్లయితే త్వరగా అడుగుతుందట.
4). బంగాళదుంప, బెండకాయలు వంటివి ఫ్రై చేసేటప్పుడు అడుగు భాగానికి అంటకుండా ఉండాలంటే.. స్టవ్ మీద పెట్టిన గిన్నె వేడైన తరువాత నూనె వేయాలి.
5). ఏవైనా పండ్లు త్వరగా మాగాలంటే వాటిని ఒక న్యూస్ పేపర్లో చుట్టి బియ్యపు డబ్బాలో ఉంచితే పండ్లు మాగుతాయి.
6). కంది పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరి.
7). పచ్చిబఠానీలు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే వాటిని ఒక వస్త్రంలో కట్టి వేడి నీళ్లలో మూడు నిమిషాల పాటు ఉంచి , చల్లని నీటిలో ముంచిన తరువాత వాటిని ఆరబెడితే ఎక్కువ రోజులు ఉంటాయి.
8). అగర్బత్తి వెలిగించిన తరువాత వచ్చే బూడిదతో ఇత్తడి పాత్రలను తోమి నట్లు అయితే అవి మిలమిలా మెరుస్తాయి.
9). తేనెలో కి రెండు లేదా మూడు మిరియాల గింజలు వేసి నట్లు అయితే ఆ తేనె డబ్బాకు చీమలు చేరవు.

10). లడ్డూ లు ఫ్రెష్ గా ఉండాలి అంటే మైక్రోవేవ్ ఓవెన్ లో ఒక అర నిమిషం ఉంచితే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: