లైఫ్ స్టైల్: ఖాళీ కడుపుతో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..?

Divya
భారతదేశంలో ఎక్కువగా నెయ్యిని అన్నిటిలోకి ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా రుచికరమైన స్వీట్ తయారు చేసేటప్పుడు ఈ నెయ్యి ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యి తింటే బరువు పెరుగుతారని ఎంతోమంది చెప్పడం జరిగింది. అందుచేతనే కాస్త బొద్దుగా ఉన్నవారు నెయ్యి వైపు ఎక్కువగా చూడరు. అలాంటి వారు నెయ్యి లేని పదార్థాలను ఎంచుకోని మరీ తింటూ ఉంటారు. కానీ నెయ్యి తింటే బరువు పెరుగుతారా అనేది ఒక అపోహ అని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏదైనా సరే పరిమితిలో మాత్రమే తినడం మంచిదట. అందుచేతనే నెయ్యి కూడా ఎక్కువగా తింటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుపుతున్నారు.

ప్రముఖ పోషకాహార నిపుణులలో ఒకరైన అవంతి దేశ్ పాండే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నెయ్యి గురించి కొన్ని ప్రయోజనాలను తెలియజేశారు. ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలియజేశారు. నెయ్యి/వెన్న ఈ రెండు చాలా స్పష్టమైనవి అని తెలియజేశారు. ఉదయాన్నే కాళీ కడుపుతో వీటిని తినడం వల్ల.. ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయట. అంతే కాకుండా ఆయుర్వేదం ప్రకారం చిన్న ప్రేగు యొక్క సామర్థ్యం మెరుగు పడుతుందట. ప్రతి రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే చెడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చిన కొన్ని సమస్యలు దూరమవుతాయట.

ముఖ్యంగా నిద్రలేని రాత్రులు, అనారోగ్య సమస్య, రోజంతా అలానే కూర్చోవటం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఉదయం పూట ఈ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. తగిన మోతాదులో తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా కాంతివంతంగా కూడా చర్మం మెరుస్తుంది. ముఖం మీద ముడతలు తగ్గి ఎన్నో లాభాలను చేకూరుస్తుంది.. మలబద్దక సమస్య ఉన్నవారు తినడంవల్ల సుఖ విరేచనం అవుతుంది. నెయ్యి తినడం వల్ల కడుపునిండినట్లు గా అనిపిస్తుంది.. దీనివల్ల మీరు అతిగా తిండి తినక పోవచ్చు. అయితే ఇలాంటివి అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: