లైఫ్ స్టైల్: ఇలాంటి చిట్కాలతో టేస్టీ ఫుడ్ చిటికలో..!!

Divya
సాధారణంగా వంట చేయడం అనేది ఒక కళ.
కొంతమంది ఎంత బాగా వండినప్పటికీ అందులో రుచి ఉండదు.. కానీ మరికొంతమంది అలా చేయి ఆడించగానే ఆ వంటకానికి అద్భుతమైన రుచి వస్తుంది.. ఇకపోతే వంటలలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ గొప్ప రుచిని తీసుకురావడం అంటే అది చాలా కష్టతరమైన పని.. ఇక ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎవరు చేసినా ఎలా చేసినా ఆ వంట అద్భుతహ అనాల్సిందే. ఆ చిట్కాలేంటో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
పరాటా:
పరాటా లను తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే పరాటాలు చేసేటప్పుడు అందులో కొద్దిగా తురిమిన  ఉడికించిన బంగాళదుంపలను జోడించినట్లయితే చాలా రుచిగా , చక్కగా వస్తాయి. ఇకపోతే నూనె, నెయ్యి వాడడం కంటే బెల్లం తో తయారు చేసే పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఈసారి పరాటా చేస్తే మీరు కచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.
గ్రేవీ లేదా కూర:
గ్రేవీ లేదా ఏదైనా కూరలు సిద్ధం చేసేటప్పుడు అందులో కొద్దిగా సత్తు పిండి కలపండి. సత్తుపిండి వేయడం వల్ల మీ గ్రేవీకి చక్కని రుచి తో పాటు చిక్కగా కూడా వస్తుంది..
పూరీలు:
పూరీలు చేసేటప్పుడు క్రిస్పీగా రావాలంటే.. పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా బియ్యం పిండి జోడించండి.. ఇక అలాగే రెండు చెంచాల పంచదార వేసి పిండి కలిపినట్లయితే పూరీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.
నూడుల్స్:
ఇక నూడుల్స్ తయారు చేసేటప్పుడు మరిగే నీటిలో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేయాలి. తర్వాత బయటకు తీసి వెంటనే చల్లటి నీళ్లలో కడిగేయాలి. నూడుల్స్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి.
అన్నం:
అన్నం ఎంత బాగా వండినా ముద్ద లాగా అయిపోతుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపితే చాలా రుచిగా పొడిపొడిగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: