లైఫ్ స్టైల్: బాత్రూం మేకోవర్ కు చక్కటి చిట్కాలు..!!

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రాయింగ్ , డైనింగ్ , కిచెన్ , బెడ్ రూమ్ వంటి వాటితో పాటు బాత్రూములు కూడా ఒక ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయి. ఈ కాలంలో చాలామంది ఎవరైనా ఇంటికి వెళితే వారి బాత్రూమ్ ఎంత అందంగా ఉందో తెలుసుకోవడానికి ముందు వారి బాత్రూం ఉపయోగించడం మొదలు పెడతారు.. అయితే ఈ బాత్రూమ్ అందరికంటే భిన్నంగా చాలా చక్కగా అందంగా కనిపించాలంటే తప్పకుండా బాత్రూమ్ యొక్క మేకోవర్ చేయాల్సిందే.. బాత్రూమ్ అందంగా .. శుభ్రంగా కనిపించాలి అంటే ఈ చిట్కాలు పాటించడం తప్పనిసరి.

బాత్రూం ఉపకరణాలు:
ఉదాహరణకు మనం బాత్రూం లో ఉపయోగించే సబ్బు పెట్టే మొదలుకొని.. ఆయిల్ బాటిల్.. టవల్ లాంటివన్నీ కూడా ఒకే రంగులో ఉంటేనే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అలాంటి రంగు కాకపోయినా ఆ రకమైన షేడ్ ఉన్న వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.. ఇలా ఉపయోగించడం వల్ల మొత్తం బాత్రూమ్ రూపానికి కొత్త కాంతి వస్తుంది.

బాత్ టబ్:
ఒకవేళ మీ బాత్ రూం పెద్దగా ఉంటే అందులో ఒక మూలలో స్నానపు తొట్టె తప్పనిసరిగా ఉంచుకోవాలి.. ముఖ్యంగా బాత్ రూమ్ సైజు ఎలా ఉన్నా సరే అందులో ఒక మూలన ఈ బాత్ టబ్ పెట్టుకోవడం వల్ల బాత్రూంకు చక్కటి అందం వస్తుంది.. లేత నీలం రంగులో ఉండే టబ్  కనుక మీరు తీసుకున్నట్లయితే సముద్రం మాదిరి ఒక లుక్ కూడా వస్తుంది.
టైల్స్:
ఇక టైల్స్ అనేది ఆధునిక బాత్ రూమ్ డెకరేషన్ లో అంతర్భాగం.. ఒక టైల్స్ ఎంచుకునేటప్పుడు సిమెంట్, పింగాణీ, గాజు, సున్నపురాయి వంటి ఎన్నో ఎంపికలు మనకు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా మార్బుల్ స్టైల్స్ కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ డిజైనర్ టైల్స్ ను కూడా మీరు ఇన్స్టాల్ చేయవచ్చు. కొంచెం ధర తో ఉండే  ఫినిషింగ్ టైల్స్ ఇన్స్టాల్ చేయించుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: