ఆ దేశం సంతోష సీమ


హ్యాపీ సండే : కేవలం 55 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్న చిన్న దేశం ఫిన్లాండ్ ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం  ప్రకటించిన సంతోష సూచి  లో  వరుసగా 4 సారి  ప్రపంచంలోనే అత్యంత  సంతోష కర దేశంగా ప్రకటించబడింది. ఇక్కడ ఎకానమీ , విద్యావిధానం , ప్రజల బాగోగులుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ దేశ ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు సైతం సంతోష కరంగా ఉంటున్నారని పేర్కొంది. 

ఆ దేశ పౌరులు ఒత్తిడికి గురి కాకుండా సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన సమాజంలో స్వేచ్చగా , భాద్యతగా బతుకుతున్నారు. మిగిలిన యూరోప్ దేశాల కంటే  అక్కడి జీవన ప్రమాణాలు అన్ని మెరుగ్గా ఉంటాయి. ఇంకా విద్యావిధానం విషయానికి వస్తే పిల్లలపై ఏటువంటి ఒత్తిడి ఉండకుండా ఉండేలా రూపొందించారు. నైపుణ్యాల అభివృద్ధి లో సైతం ఈ దేశం ముందుంది  .ప్రస్తుతం  ఆ దేశ  విద్య విధానం ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 

సంతోషాన్ని కొలిచే ఈ  సంతోష సూచి  (Happiness Index) ని ఐక్యరాజ్య సమితి 2012 నుంచి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా  ఏ దేశ ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉన్నారనేది లెక్కించి చెబుతుంది. ప్రతియేటా మార్చి 20 న ఈ సూచి  ని విడుదల చేస్తారు , ఆరోజే ఎందుకంటే"ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్" కాబట్టి . 

సంతోష సూచిని  దేశ తలసరి ఆదాయం , స్వేచ్చ , సాయం చేసే గుణం , ఆరోగ్యంగా ఎంతకాలం బతుకుతామన్నది , అవినీతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని ఐక్యరాజ్య సమితి రూపొందిస్తుంది . ఈ సూచి ప్రకారం అగ్రరాజ్య లైన అమెరికా వంటి దేశల్లో ఉన్న ప్రజల కంటే  కంటే ఫిన్లాండ్ , నార్వే , భూటాన్ , స్వీడన్ వంటి చిన్న దేశాల్లో ఉన్న ప్రజలే చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. 

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: