లైఫ్ స్టైల్: గృహప్రవేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలుసా..?

Divya
సాధారణంగా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెగ ఆలోచిస్తూ ఉంటాము.. ఇక ముఖ్యంగా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు ఇస్తే వారికి ఉపయోగపడతాయి అనే విషయం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీ ఇరుగింటి వారికి.. పొరిగింటి వారికి లేదా మీకు నచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం తో వారిని బాగా సంతోష పెట్టవచ్చు. అయితే ఎలాంటి బహుమతులు ఎంచుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

లాఫింగ్ బుద్ధ:
లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో కనిపించే అందమైన వస్తువు మాత్రమే కాదు.. దీని లోపల లోతైన అర్ధం కూడా దాగి ఉంది. ఈ లాఫింగ్ బుద్ధ కేవలం అలంకార వస్తువుగా మాత్రమే కాకుండా ఆ ఇంటికి సంతోషం, ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలను కూడా తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ బహుమతి ఇవ్వడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.
గోడ గడియారాలు:
ముఖ్యంగా గడియారాలు ఇచ్చేటప్పుడు కొంచెం స్టైలిష్ గా ఉండేలాగా ఎంచుకోండి. గోడ గడియారాలు ఎంచుకునేటప్పుడు అది ఇంటి యొక్క గోడ రూపాన్ని మెరుగు పరచడానికి కూడా ఉపయోగపడాలి. రకరకాల స్టైలిష్ గోడ గడియారాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి సరసమైన ధరలో ప్రత్యేక ఆకారాలలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఇండోర్ ప్లాంట్స్
బహుమతులు ఇవ్వడం వల్ల వారి ఇంటి రూపాన్ని  మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ వల్ల వారి ఇంటికి అన్ని రకాల శుభం కలుగుతుంది. కాబట్టి వీటిని ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.
బెడ్ షీట్
కొత్త ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు వారికి బెడ్షీట్లు కూడా గిఫ్టుగా ఇవ్వవచ్చు. కొత్త ఇంటిని అలంకరించడానికి ఇవి బాగా సహాయ పడతాయి.
డిన్నర్ సెట్
డిన్నర్ సెట్ లేని వంట ఇల్లు పరిపూర్ణం కాదు.. కాబట్టి వీటిని  ఇచ్చి ఆడవారిని మరింత సంతోష పరచవచ్చు.
హోమ్ థియేటర్స్, విండ్ చైన్ లాంటివి కూడా బహుమతులుగా ఇవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: