ఆస్ట్రేలియాలో.. భూమి ఉచితమట..!

ఆస్ట్రేలియా లో జనాభా తగ్గుముఖం పడుతుందని అక్కడి ప్రభుత్వం ఆందోనళ పడుతుంది. అందుకే అక్కడ మళ్ళీ జనాభా అభివృద్ధి చేసేందుకు కొత్త పధకాన్ని తీసుకువచ్చింది. ఎవరికైన ఇళ్లు కట్టుకోవడానికి భూమిని ఉచితంగా ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. దీనితో ఉన్న బ్యాచులర్ లకు వివాహాలు అవుతాయి. వాళ్ళు పిల్లలను కని దేశజనాభా వృద్ధికి సహకరిస్తారని ప్రభుత్వ ఆలోచన. లేనోడు లేక చస్తుంటే, ఉన్నోడు అరక్క చచ్చాడని సామెత ఉంది. ఇది అలాగే ఉంది, జనాభా విపరీతంగా ఉందని కొన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే, మరి కొన్ని దేశాలు తమ జనాభా రానురాను తగ్గిపోతుందని బాధ పడుతున్నాయి. అందుకే దానిని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచంలో పరిస్థితులు భలే విచిత్రంగా ఉన్నాయి కదూ. ఆస్ట్రేలియాలో కూడా క్విల్పి అనే నగరంలో జనాభా భారీగా తగ్గిపోతుంది. ప్రభుత్వం కూడా జనాభా అభివృద్ధి చేయడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా అక్కడ మాత్రం జనాభా సంఖ్యను మాత్రం పెంచలేకపోయింది. ఇక్కడ ప్రస్తుతం గణాంకాల ప్రకారం కేవలం 800 మంది మాత్రమే ఉన్నారు. ఉచిత భూమి ప్రకటించినా కూడా ఇక్కడ జనాభా వృద్ధి లేదంట. ఇక్కడ కొరత కారణంగా పశుపోషణ, గొర్రెల పెంపకం లాంటివి కొనసాగించలేకపోతుంది ప్రభుత్వం. ఇలాంటి సమస్యలు రానురాను అన్ని దేశాలకు రావడం తప్పదు కాబోలు.  ఎందుకంటే, వచ్చే రోజులు అన్ని యంత్రాల రోజులు. ఇలాంటి పనులు చేసుకోవడానికి పాతకాలం లో లాగా మనుషులు లభించకపోవచ్చు. అందరు ప్రభుత్వ చొరవతో చదువుకుంటారు, కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారు. అందుకే చాలా తొందరలో ప్రతి దేశం ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు.
ఇప్పటికే కొన్ని పనులకు మనుషులు లభించడం కష్టంగానే ఉంటుంది. అన్ని వర్గాలు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తున్నందున ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఎవరూ మిగలరు. అప్పుడు కూడా వీటి నుండి వచ్చే ఉత్పత్తి మాత్రం కావాలి కాబట్టి వీటిని పోషించక తప్పదు. కానీ పనివాళ్ళు మాత్రం మనుషులు ఉంటారా లేక యంత్రాలు ఉంటాయా అనేది భవిష్యత్తు చెప్పాల్సి ఉంది. అందుకే ప్రపంచ దేశాలు డిగ్నిటీ అఫ్ లేబర్ కింద ఈ స్థాయి పనులను కూడా ఆయా విద్యాభ్యసలలో చేర్చడం ద్వారా (ఉదాహరణకు పశువైద్యం, గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ లాంటివి డిగ్రీ లుగా చేర్చినట్టు) కొందరికి అందులో ఉచిత సీట్లు కేటాయించడం ద్వారా వీటిని నిర్వహించడానికి కూడా మానవ వనరులను అందుబాటులో ఉంచుకోవచ్చు. ఇక్కడ సమస్య జనాభా కాదు, అందరు విద్యాబ్యాసం చేసినందున ఇలాంటివి సరాసరిగా చేయాలంటే చిన్నతనంగా ఉండొచ్చు, అందుకే విధ్యాబ్యాసంలో ఇవి భాగం చేస్తే, వాళ్లకు ఉపాధిగాను ఉంటుంది, మిగిలిన వారి అవసరాలు తీరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: