ఇండియాలో చూడాల్సిన అత్యంత్య పురాతన దేవాలయాలు ఇవే !

Vimalatha
భారతదేశంలో పురాతన దేవాలయాలకు కొరత లేదు. ఈ దేవాలయాలకు ఉన్న చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ. కొన్ని దేవాలయాలు, వాటి నిర్మాణానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడూ ఈ దేవాలయాలను జీవితంలో ఒక్కసారన్నా సందర్శించాలి.
కోణార్క్ సూర్య దేవాలయం, ఒరిస్సా
13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ సూర్య దేవాలయం ఒక అద్భుతం. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. ఇక్కడ సూర్య దేవుడు 24 చక్రాల రథంపై కూర్చుంటాడు. ఇది ఒడిశాలోని అతి ప్రాచీన ప్రదేశాలలో ఒకటి.
కైలాస దేవాలయం, మహారాష్ట్ర
భారతదేశంలోని అత్యంత మనోహరమైన పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మహారాష్ట్ర, ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని ఒకే ఒక్క రాతిపై చెక్కారు. ఎల్లోరాలో అనేక గుహలు ఉన్నాయి. కైలాస ఆలయం 16 వ గుహలో ఉంది. ఇది 8 వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు. ఇది ఖచ్చితంగా భారతదేశంలోని అత్యుత్తమ అద్భుతాలలో ఒకటి.
దిల్వారా దేవాలయం, రాజస్థాన్
మౌంట్ అబూలో ఉన్న దిల్వారా జైన దేవాలయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అత్యంత పురాతనమైన విమల్ వసాహి ఆలయం. దీనిని 1032 సంవత్సరంలో నిర్మించారు. జైన తీర్థంకరులకు ఐదు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి.
షోర్ టెంపుల్, తమిళనాడు
మహాబలిపురంలో షోర్ టెంపుల్ అని పిలువబడే ఈ అద్భుతమైన ఆలయ సముదాయాన్ని చూడడం అద్భుతం. గ్రానైట్‌తో 8 వ శతాబ్దంలో ఈ దేవాలయాలను పల్లవ రాజవంశానికి చెందిన నరసింహవర్మ II నిర్మించారు. ఇక్కడ ఉన్న రెండు దేవాలయాలలో ఒకదాన్ని శివుడికి అంకితం చేశారు. మరొకటి విష్ణువుకు అంకితం చేశారు. ఇక్కడి కళాఖండాలు ఖచ్చితంగా మంత్రముగ్దులను చేస్తాయి.
విరూపాక్ష దేవాలయం, కర్ణాటక
హంపి స్మారక కట్టడాలలో భాగంగా విరూపాక్ష దేవాలయాలు శివుడికి అంకితం చేశారు. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నుండి వాడుకలో ఉంది. ఇక్కడ ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: