లైఫ్ స్టైల్: వంటింట్లో వాడే కారంపొడి కల్తీ చేశారో.. లేదో.. తెలుసుకోవడం ఎలా..?

Divya
ప్రాచీన కాలంలో మన పెద్దవాళ్లు కారంపొడి అనగానే ఎండు మిరపకాయలను ఎండకు బాగా ఎండబెట్టి మరుసటి రోజు వాటిని రోట్లో వేసి దంచి పొడి చేసుకునేవారు.. ఇలా చేయడం వల్ల ఈ పొడి తాజాగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం మన్నిక రావడంతోపాటు ఎర్రగా నిగనిగలాడుతూ ఉండేది. ఇక చక్కటి ఘాటైన రుచి కలిగి ఉంటుంది ఈ ఎండు మిరపకాయల పొడి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. కాబట్టి ప్రతి ఒక్కరు మార్కెట్లో దొరికేటటువంటి కారంపొడి ప్యాకెట్ ను తీసుకొచ్చి ఉపయోగించుకుంటున్నారు.
ప్యాకెట్లలో రంగు , ఇటుకల పొడి కలుపుతున్నారని వార్తలు అప్పట్లో పెద్ద దుమారం సృష్టించాయి. ఇక మార్కెట్లో దొరికేటటువంటి కారంపొడి ప్యాకెట్లను మనం ఉపయోగించడం వల్ల వంటలలో రంగు వస్తుంది కానీ కారం ఉండదు.. పైగా రుచి అసలే ఉండదు. అయితే మనం ఆ ఎండు మిరపకాయల పొడిని కల్తీ చేశారో లేదో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇటీవల ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కారం పొడి ని ఎలా టెస్ట్ చేయాలో.. ఇటుకల పొడి కలిసి ఉందా.. ఎర్రమట్టి కలిసి ఉందా.. అనే విషయాలను కూడా తేలికగా కనిపెట్టవచ్చట. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
టెస్ట్ అంటే ఇదేదో ల్యాబ్ లో చేసే టెస్ట్ కాదండోయ్.. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే కారం పొడిని  టెస్ట్ చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, అందులో మీరు వంటలో ఉపయోగిస్తున్న కారం పొడిని వేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని  కొద్దిగా దోసిళ్ళ లో వేసుకొని చూడండి. అయితే ఒకవేళ మీకు అందులో ఏదైనా ఇసుక లాగా కనుక తగిలింది అంటే , కచ్చితంగా దానిని ఇటుక పొడి తో తయారు చేసి ఉంటారని మీరు గమనించవచ్చు.. అలా కాదని మీకు సబ్బు మాదిరి కనబడింది అంటే అందులో ఏదైనా ఎరుపురంగు సబ్బు కలపబడింది అని గ్రహించాలి.
ఇలా చెక్ చేసి కూడా మీ వంటింట్లో ఉపయోగించే కారంపొడి కల్తీ అయిందో లేదో కూడా కనిపెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: