ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు..!

kalpana
ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా తినే ఆహారం కూడా ఒక కారణం, సమయానికి తినకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. షుగర్ పెరగడం,  గుండె జబ్బులు, వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి బరువు తగ్గడానికి కొన్ని సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
 భోజనం చేసే గంట ముందు గా సూప్ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.ఫలితంగా తక్కువగా తింటారు. దానివల్ల బరువు తగ్గుతారు. సూపర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవాల. మన ఇంట్లో ఉండే కూరగాయలతోనే వేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
 ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. బ్రేక్ ఫాస్ట్ చేయడంవల్ల రోజుకు సరిపోయే శక్తి లభిస్తుంది.సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయడంవల్ల తక్కువ రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి.
 ఆకలి ఎక్కువగా ఉండదని ఒకేసారి,కడుపునిండా తినకూడదు. తినడం వల్ల బరువు పెరుగుతారు.  బరువు తగ్గాలనుకొనే వాళ్ళురెండు మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల సులభంగా తగ్గుతారు.కొద్దిగా కొద్దిగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గవు,ఆకలిని పెంచే హార్మోన్లు కూడా విడుదల కాకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు.
 కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మెటబాలిజమ్ సాధారణ స్థాయి కంటే 8 శాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రి భోజనం తో పాటు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
 ఉదయం పూట గ్రీన్ టీ తాగుతాము కానీ రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారు.గ్రీన్ టీ మెటబాలిజం పెంచుతుంది. దీని వల్ల లావు తగ్గడం మే కాకుండా క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రావు. గ్రీన్ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల చెడు ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తాగాలి.
 బరువు తగ్గాలనుకునేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.బరువు పెరగడానికి చక్కెర ముఖ్య కారణం కాబట్టి చక్కెరతో చేసిన స్వీట్ తినకపోవడం మంచిది.కాఫీ టీ లో కూడా చక్కెరకు బదులు బెల్లం వేసుకోవడం మంచిది.
 పడుకునేటప్పుడు వెలుతురు లేకుండా చీకటిగా ఉండేటట్లు చూసుకోండి.దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.పడుకున్నప్పుడు సాధారణంగా మెలటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది.దీనివల్ల బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ నిద్రపోయేటప్పుడు ఎక్కువగా విడుదల అవుతుంది.దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. అందుకే చీకటిలో పడుకోవాలి.
 బరువు తగ్గాలనుకొనే వారు బాగా నిద్ర పోవాలి. రోజుకు 8 గంటలు నిద్ర పోవాలి.హ్యాపీగా నిద్ర పోవడం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. కాబట్టి తక్కువ తిని బరువు తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: