చింత చిగురుతో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..

Satvika
చింత చిగురు.. ఈ పేరు వినగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.. పుల్లగా ఉండే ఈ ఆకును వంటలలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం వివిధ రకాల వంటలను చేస్తారు. అయితే ఇప్పటివరకు తెలుగు ప్రజలు చింత చిగురు తో పప్పు, పచ్చడి లాంటి కూరలను ఎక్కువగా చేసుకుంటారు. వాటిలోనే ఒక్కొక్కరు ఒక్కోలా వంటలు చేసుకుంటారు. చింత చిగురు తో ఎలా చేసుకున్న టెస్ట్ అదిరిపోతుంది. కానీ ఈ చిగురు తో పులిహోర చేసుకోవడం పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ ఈ చిగురు తో చేసే పులిహోర చాలా రుచిగా ఉంటుందని అంటున్నారు .. ఇంక ఆలస్యం ఎందుకు చింత చిగురు తో పులిహోర చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు..
చింత చిగురు : ఒక కప్పు,
బియ్యం : రెండు కప్పులు,

వేరుశనగ పలుకులు : గుప్పెడు,
మినుప్పప్పు : ఒక టీ స్పూన్‌,
శెనగపప్పు : ఒక టీ స్పూన్‌,
ఎండుమిర్చి : నాలుగు,
కరివేపాకు : రెండు రెబ్బలు,
ఆవాలు : అర టీ స్పూన్‌,
ధనియాలు : ఒక టీ స్పూన్‌,
 పసుపు : పావు టీ స్పూన్‌,
 
ఉప్పు : రుచికి సరిపడా,

 నూనె : తగినంత

తయారీ విధానం :
ముందుగా అన్నాన్ని వండి పక్కన పెట్టుకోవాలి.. మాములుగా చేసుకోవడం కన్నా అన్నం పొడిగా అయ్యేలా వండుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకొని, చింత చిగురును వేయించి పక్కన పెట్టుకోవాలి.అదే పాన్ ఎండుమిర్చి, ధనియాలు, మినుప్పప్పు, శెనగపప్పు, వేరుశనగ పలుకులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న చింత చిగురు, పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే చింత చిగురు పొడి వేసి, బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం అయ్యాక పొడిపొడిగా చేసుకున్న అన్నంతో పాటు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అంతే, వేడివేడి చింత చిగురు పులిహోర రెడీ.. ఇలా ఒకసారి కనుక చేసుకొని తింటే చింత పండు పులిహోర ను మర్చిపోవాల్సిందే..  మీకు ఈ వెరైటీ పులిహోర నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: