యాపిల్ ను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...

Satvika
సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఆహారం మిగిలితే వెంటనే ఆలోచించకుండా పడేస్తాము.. అది నిజమే.. కానీ ఒక్క పూట కూడా అన్నం దొరకక చాలా మంది నానా అవస్థలు పడుతుంటారు. ఇకపోతే పండ్లను ఎక్కువగా పడేస్తుంటాం.. పండ్లు పైన పాడై పోయిన కూడా లోపల మాత్రం మంచి పోషకాలను కలిగి ఉంటుందని అంటున్నారు నిపుణులు.. ఏ పండు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

కూరగాయలు, పండ్ల చెక్కులు చెత్త బుట్టలో పారేయనక్కరలేదు, వాటితో కొన్ని వెరైటీ ఫుడ్స్ చేయవచ్చు. యాపిల్ చెక్కు కూడా అంతే బలాన్నిస్తుంది. చాలా మందికి యాపిల్ ని చెక్కు తీసి తినడమే ఇష్టం. ఆ చెక్కుని పారేస్తూ ఉంటారు. మీరు యాపిల్ ని ఎలా తింటారో అది మీ ఇష్టం, కానీ ఆ చెక్కుని వేస్ట్ చేయనక్కర్లేదు..మరి చెక్కతో ఎం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

వాటి చెక్కును తీసుకొని అందులో పంచదార, దాల్చిన చెక్క పొడి, ఇంకా మీకిష్టమైన పదార్ధాలతో సీజన్ చేసి ఒవెన్ లో బేక్ చేయండి. తియ్యగా, కరకరలాడుతూ ఉండే యాపిల్ చిప్స్ రెడీ అయిపోతాయి. మీకు తియ్యగా ఇష్టం లేకపోతే ఉప్పు, మిరియాల పొడి తో కూడా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి..

యాపిల్  చెక్కునీ, మధ్య భాగాన్నీ నీటిలో వేసి నీరు చిక్కబడే వరకూ ఉడికించండి. వడకట్టి పంచదార వేసి పంచదార కరిగేవరకూ మళ్ళీ మరిగించండి. పాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్, బ్రౌనీస్ మీద ఈ యాపిల్ పీల్ సిరప్ ని ఎంచక్కా వాడుకోవచ్చు..

ఇవే కాకుండా యాపిల్ పీల్ జామ్, స్మూతిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.. హెల్దీ, టేస్టీ గా ఉండే ఫుడ్స్ ప్రిపేర్ చేయవచ్చు. ఇవి తిన్నాక మీరు యాపిల్ పీల్ అంటే ఇష్టం పెరుగుతుంది. యాపిల్ పీల్ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడమే కాక స్కిన్ హెల్త్ కి కూడా హెల్ప్ చేస్తుంది.  చూసారుగా యాపిల్ తొక్క తో ఎన్ని వెరైటీ కు చేసుకోవచ్చునో ..మీరు ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: