టీవీ చూస్తూ తింటున్నారా ? అయితే మీకు మూడినట్లే..!!

Satvika
మాములుగా వినోదానికి సంబందించిన ఏదైనా వీక్షిస్తున్నపుడు ( టీవీ, సినిమా) చాలా మంది తింటూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు..అలా ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తెలియకుండానే తినడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాకపోవడం తో పాటుగా శరీరంలో అధిక కొవ్వును కూడా పెంచుతుంది. దీంతో భారీగా బరువు పెరుగుతారు.టీవీ చూస్తూ మనల్ని మనం మర్చిపోయి తినకుండా.. మితంగా ఆహారం తీసుకునేలా కొన్ని చిట్కాలున్నాయి..అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఏ పని చేస్తున్నా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే చేసే పనిపై అవగాహన ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు కూడా.. దానిపైనే దృష్టి పెడితే పొదుపుగా తినగలం, కడుపు నిండితే మెదడే ఇక తినడం ఆపు అన్నట్లు సంకేతాలు ఇస్తుంది. కానీ, చాలా మంది తినేటప్పుడు టీవీ చూస్తూ ఒకేసారి రెండు మూడు పనులు చేస్తుంటారు. వినోదాన్ని వీక్షించేటప్పుడు మెదడు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతుంది.. దాంతో అతిగా లాగించేస్తున్నారు..దాని ఫలితంగా అధిక బరువు తో బాధపడుతున్నారు..

కానీ ఆకలి వేసినప్పుడు టీవీ దగ్గరకు తెచ్చుకోవడం కన్నా కూడా భోజనం దగ్గరకే వెళ్లి తినడం ద్వారా ఇష్టమైన సన్నివేశం వస్తుందని కొద్దిగానే తింటారు.. అందుకే ఇప్పటి నుంచి అలా అలవాటు చేసుకోండి. ఒక్కసారిగా టీవీ చూస్తూ తినడం మానేయమంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆ అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. టీవీ ముందు కూర్చొనేటప్పుడు భోజనమైనా.. పాప్‌కార్న్‌, పకోడీలు, మిర్చి వంటి చిరుతిళ్లయినా తక్కువ మొత్తంలో తెచ్చుకొని తినడం మంచిది..

ఖాళీగా కూర్చొని తింటే రాల్లైన కూడా కరిగిపోతాయి.. అందుకే టీవీ చూసేటప్పుడు ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదోక పని చేస్తూ ఉంటే బెటర్.. అదే ఆడవాళ్ళు అయితే గోళ్లకు పెయింట్ వేసుకోవడం, కాళ్ళకు మసాజ్ చేయడం లేదా అందాన్ని మెరుగు పరుచుకునే వాటిని చేయడం వల్ల మరింత అందంగా తయారవుతారు.. అంతే కాదు నాజూకుగా కూడా ఉంటారు.టీవీ ముందు కూర్చొని ఏదైనా తినాలనిపిస్తే నీళ్లు తాగండి. కొంతమంది దాహం వేసినా చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. వాటి బదులు నీరే తాగితే కడుపు నిండిపోయి ఏమీ తినాలనిపించదు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలతో పాటుగా అందం కూడా మెరుగు పడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: