వీటిని ఇంట్లోనే తయారు చేసుకొని తింటే బరువు ఇట్లే తగ్గుతారట..

Satvika
ఈ మధ్య కాలంలో అందరినీ భాదించే సమస్య అధిక బరువు.. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారడంతో మనుషుల శరీరంలో కూడా మార్పులు సంభవించాయి.. ఈజీగా చేసే పనులకు అలవాటు పడటంతో శరీరానికి శ్రమ లేకపోవడంతో మనుషులు స్థూలకాయం , మధు మెహం వంటి సమస్యలతో పోరాడుతున్నారు. 50 ఏళ్ల పైన రావలసిన జబ్బులు అన్నీ కూడా 20 లోనే తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే ఇంట్లో దొరికే వాటిని చేసుకొని తింటే బరువు తగ్గుతారని వైద్య నిపుణులు అంటున్నారు.. వేటిని తినడం వల్ల అధిక అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు నో ఇప్పుడు చూద్దాం..

గ్రీన్ టీ..
బరువును తగ్గించడంలో గ్రీన్ టీ అద్బుతం అని చెప్పాలి..ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తాయి. పైగా గ్రీన్ టీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చేస్తుంది.

ఓట్స్..

ఓట్స్ రుచిగా ఉంటాయి, ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉండి చాలాసేపు ఆకలిగా అనిపించదు.వీటిలో పంచదార బదులుగా దాల్చిన చెక్క ను లేదా తేనెను వేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది..

యాపిల్స్..

రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ మాత్రమే కాదు ఒబేసిటీ కూడా దూరంగానే ఉంటుంది. యాపిల్స్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అద్నువల్ల కడుపు నిండుగా ఉండి ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు..

పప్పులు, గింజలు..

వీటిలో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఫ్యాట్ చాలా తక్కువ, కొలెస్ట్రాల్ ఫ్రీ కావున వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి శరీరాన్ని నాజూకుగా తయారు చేస్తాయి..

క్యారెట్స్..

క్యారెట్స్ కంటి చూపు బాగుండడానికే కాదు, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల క్యాలరీ ఇన్‌టేక్ తగ్గుతుంది. అందుకే క్యారెట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. కూరగా లేదా స్నాక్ లాగా తీసుకున్న కూడా చాలా మంచిది..

వీటితో పాటుగా పాప్ కార్న్, పాలకూర, పన్నీర్ వంటి వాటిని కూడా తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు కరుగుతుంది.. వీటిని ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల మరింత మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: