లావు తగ్గాలంటే ఇలా చేయాల్సిందే..!

Durga Writes
లావు.. ప్రస్తుతం మనుషుల్లో 70 శాతం మందికి ఈ లావు సమస్య ఉంది. ఆలా లావు ఉన్న వారు ఎంత తగ్గాలనుకున్న అసలు తగ్గలేరు. కొంతమంది లావు తగ్గిన చర్మం ముడతలు పడి చిన్న వయసులోనే వృద్ధులల కనిపిసితారు. అందుకే ఈ మధ్య చాలామందికి ఆరోగ్య స్పృహ పెరగటంతో సౌందర్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దీంతో ఎక్కడంటే అక్కడ తిండి తినకుండా వ్యాయామం చెయ్యటం మొదలు పెట్టారు. అయితే వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందమైన శరీరం మీ సొంతం అని అంటున్నారు నిపుణులు. 


గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి, చెంచా తేనె కలిపి తాగితే కొవ్వు కరగటమే గాక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


రోజూ ఉదయాన్నే గంటసేపైనా రన్నింగ్, జాగింగ్ చేయాలి. 


వ్యాయామం తర్వాత కాఫీ, టీ కు బదులు ఓ కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇందులోని 'కెటాచిన్' అనే రసాయనం కొవ్వును బాగా కరిగిస్తుంది.


రోజూ క్రమం తప్పక మంచి పోషకాలు ఉండే అల్పాహారం తీసుకోవాలి. ఇందులో పండ్ల రసాలు, ఎగ్ వైట్ వంటివి ఉండాలి.


మెలకువగా ఉన్నప్పుడు గంటకోసారైనా కొద్దికొద్దిగానైనా నీరు తాగుతూ ఉండాలి. 


బరువు తగ్గాలంటే వేళకి తినటం, పడుకోవటం చేయాలి. అప్పుడే జీవక్రియలు సరిగా జరుగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: