స్కిప్పింగ్ చేస్తే పిల్లలు ఎత్తు పెరుగుతారా..?

N.ANJI
ఒక మనిషికి సర్టెన్ ఏయ్ వచ్చిన తర్వాత ఎత్తు పెరగడం నిలిచిపోతుంది. తల్లిదండ్రుల హార్మోన్స్ బట్టి వాళ్ల పిల్లలు పొట్టిగా, పొడువుగా, మధ్యస్థంగా పెరుగుతారు. పొడువుగా, మధ్యస్థంగా ఉంటే చూడటానికి బాగుంటారు. కానీ పొట్టిగా ఉంటే.. అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. అలా అని అతి పొడవు కూడా మంచిది కాదు. ఒక మనిషిని పొడవుగా.. పొట్టిగా చేయడం ఎవరి సాధ్యం కాదు. చిన్నతనంలోనే పౌష్టికాహారం, వ్యాయామం చేయడం వల్ల పొడవు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎత్తు పెరగడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. టీనేజీలో ఎంటర్ అయ్యే దశలోనే పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఎముకలు, కండరాలు పెరుగుతాయి. అందుకే నిర్దిష్ట వయసులో పిల్లలు వ్యాయామం చేయాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందికి స్కిప్పింగ్ చేయడం వల్ల ఎత్తు పెరుగుతారా అనే డౌట్ ఉంది. రోప్‌తో స్కిప్పింగ్ చేయడం అనేది సాధారణంగా అందరూ చేస్తుంటారు. స్కిప్పింగ్ చేసేటప్పుడు తల నుంచి కాలి వరకు కణాలు ప్రేరేపితమవుతాయి. తద్వారా శరీర కణాలు చురుకుగా పని చేస్తాయి. దీంతో క్రమబద్ధమైన ఎదుగుదల, ఎత్తు పెరగడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్కిప్పింగ్‌తోపాటు వారంలో మూడుసార్లు స్విమ్మింగ్ కూడా చేయాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు శరీర భాగాలన్నీ కదులుతాయి. ఫలితంగా శరీర కణాలు ఉత్తేజితమవుతాయి. ఇది కూడా ఎత్తును పెంచేందుకు దోహదపడుతుంది.  
యవ్వన దశలో ఉన్నప్పుడు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధను వహించాయి. పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరల్లో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చిన్నపిల్లలు ఆకుకూరలు తినేలా ప్రోత్సాహించాలి. అలానే పాలతో తయారైన ఉత్పత్తులను తినేలా ప్రయత్నించాలి. పాలతో తయారైన పదార్థాలతో ఎత్తు పెరగడంతోపాటు ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. పాలల్లో ఉంటే కాల్షియం, విటమిన్లు శరీర ఎత్తు పెరగడానికి దోహదపడతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి. వీటిలో ఉంటే ప్రోటీన్స్, ఫైబర్, తదితర విటమిన్లు శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: