8 ఏళ్ల చిన్నారి ఐక్యూ చూసి షాక్ అవ్వాల్సిందే..!

Dabbeda Mohan Babu
మ‌న ఊళ్లో, మ‌న ఇంట్లో ఎన‌మిది ఏళ్ల పిల్ల‌లు ఇప్పుడిప్పుడే స్కూల్ కి వెళ్తూ ఉంటారు. కొంద‌రు చిన్నారులు బ‌డికి వెళ్ల‌నంటే వెళ్ల న‌ని మారం చేస్తూ ఉంటారు. ఎవ‌రైన ఒక చిన్నారి త‌మ త‌ర‌గ‌తిలో ఫస్ట్ వ‌స్తే.. పాప చ‌ల‌కీల ఉంద‌ని చాలా ఇంటీలిజెంట్ అని పొగిడేస్తారు. కాని ఒక ఎన‌మిది ఏళ్ల చిన్నారి తెలివిని త‌న వ‌య‌స్సు కు మించి ప్ర‌ద‌ర్శిస్తుంది. చెప్పాలంటే త‌న ఎన‌మిది ఏళ్లకే 2 డిగ్రీ ప‌ట్టాల‌ను సంపాదించింది. ఇంత‌కి ఎవ‌ర‌న‌ది చెప్ప‌లేను క‌దా.. ఆమె నే ఆధారా పెరెజ్‌. ఆధారా పెరెజ్ సుమారు 8 ఏళ్ల చిన్నారి. ఇమె మెక్సికోలోని త‌ల‌హుక్ ప్రాంతంలో ఉంటుంది. అంతే కాకుండా ఆధారా పెరెజ్ కు ఐన్ స్టీన్‌, స్టీఫెన్ హ్యాకింగ్ ల క‌న్న ఎక్కువ ఐక్యూ లెవ‌ల్స్ ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు సైతం నిర్ధారించారు.

ఆధారా ఫెరెజ్ మూడెండ్ల వ‌య‌స్సులోనే ఒక ర‌క‌మైన మాన‌సికంగా ఇబ్బందే ఉండేద‌ట. ఆ చిన్నారి త‌ల్లి ఆధార మాన‌సిక ఇబ్బందుల గురించి వైద్యుల‌ను సంప్రందించారు. చిన్నారి పై వైద్యులు ప‌రీక్ష‌లు జ‌రిపి ఆధారా ఆస్ప‌ర్జ‌ర్స్ సిండ్రోమ్ (ఆటిజం)తో బాధ‌ప‌డుతున్న‌ట్టు గుర్తించారు. ఆధార ను టాలెంట్ కేర్ సెంట‌ర్ చేర్పించాల‌ని సూచించారు. కొన్ని రోజులు ఆదే సెంట‌ర్ ఆధారా ఫెరెజ్ పెరిగింది. తాజాగా ఆధారా పై వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు. ఆధారా కు 162 పాయింట్ల ఐక్యూ లెవ‌ల్స్ ఉన్న‌ట్టు గుర్తించారు. ప్ర‌పంచ మేధావులైన ఐన్ స్టీన్, స్టీఫెన్ హ్యాకీంగ్ ల‌కే 160 పాయింట్ల ఐక్యూ లెవ‌ల్స్ ఉంటాయ‌ని భావిస్తారు. కాగా ఈ చిన్నారికి 162 పాయింట్లు ఉన్నాయ‌ని తెలిసి కుటుంభ స‌భ్యులు సంతోషిస్తున్నారు.

కాగ ఆధారా 8 ఏళ్ల వ‌య‌స్సు లో హై స్కూల్ విద్య ను పూర్తి చేసింది. అంతే కాకుండా ఆన్‌లైన్‌లో 2 డిగ్రి ల‌ను చ‌దివింది. దీనితో పాటు త‌న అనుభావాల‌ను అన్నింటితో ఒక బుక్ ను రాసింది. ఈ పుస్త‌కానికి డు నాట్ గీవ్ ఆప్ అనే టైటిల్ ను పెట్టింది. తాజాగా  ఫొర్బ్స్ విడుద‌ల చేసిన 100 మంది అత్యంత శ‌క్తివంతమైన మ‌హిళ‌ల జాబితాలో ఈ చిన్నారి స్థానం సంపాధించుకుంది. ఎన‌మిది ఏళ్లకే ఈ ఘ‌న‌త సాధించిన ఈ చిన్నారిని చూసి ప్ర‌పంచ‌మే హౌర అంటుంది.  ఈ చిన్నారి మాత్రం వ్యోమ‌గామి అవుతాన‌ని అంటుంది. అంత‌రిక్ష‌యానం చేయ‌డం త‌న క‌ల అని పెర్కోంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: