బుడుగు: నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలలో తలెత్తే సమస్యలివే..??

N.ANJI
సాధారణంగా కొంత మంది పిల్లలు నెలలు నిండకుండానేపుడుతూ ఉంటారు. ఆలా పుట్టిన శిశువులలో శరీర భాగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఉండవు. దాంతో వారికీ పర్యవేక్షణలో వైద్య సహాయం అందించాల్సి ఉంది. అయితే ఈ కారణంగా వారి పెరుగుదలపై ప్రభావం పడుతుందని, పిల్లల్లో నొప్పులు, భాద కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలిపారు. ఇక ఇలాంటి సమయంలో తల్లిని పిల్లలకు దగ్గరగా ఉంచి, ఆమె గొంతును వినిపించడం వల్ల ఆ బాధ, నొప్పి కొంతమేర తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కాగా ఈ పరిశోధనను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌ లో ప్రచురించారు.
ఇక నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలను వారి తల్లులకు దూరంగా తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌లో ప్రత్యేక ఇంక్యుబేటర్‌ లో ఉంచి చికిత్స అందిస్తుంటారు. అంతేకాక.. క్రమం తప్పకుండా మందులు ఇస్తూ వారిని రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. కాగా.. కొన్నిసార్లు ఈ వైద్య పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రమాదకరంగా మారుతాయని పేర్కొన్నారు.
అయితే గర్భం దాల్చిన తర్వాత 37 వారాల కంటే ముందే శిశువు జన్మించినప్పుడు, వారిని ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందజేస్తుంటారు. అంతేకాదు.. బ్లడ్ శాంపిల్, ట్యూబ్ ద్వారా ఆహారం ఇవ్వడం లాంటి ఇతర సాధారణ వైద్య చికిత్సలు అందిస్తుంటారు వైద్యులు. ఇక ఇది వారి ఎదుగుదల, నొప్పి నిర్వహణపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
తాజా అధ్యయనం ప్రకారం.. తల్లి దూరంగా ఉన్నప్పుడు పీఐపీపీ రీడింగ్‌ 4.5 వచ్చిందన్నారు. అంతేకాక.. తల్లి తన బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఇది 3, తల్లి పాడినప్పుడు 3.8గా ఉన్నట్లు పీఐపీపీ ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక తల్లి స్వర శబ్దం ప్రకారం ఈ వ్యత్యాసాలు గమనించవచ్చు అని అన్నారు. అంతేకాక.. ‘శిశువుల ప్రవర్తనను కోడ్ చేయడానికి మేము బ్లడ్ శాంపిల్ ను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఇక శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా, శబ్దం లేకుండా, తల్లి ఉందో లేదో తెలియకుండా ఉండటానికి వీడియోలు బ్లైండ్ చేశాం’ అని అధ్యయన బృంద సభ్యులు డీడియర్ గ్రాండ్ జీన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: