బుడుగు: పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే..!!

N.ANJI
నేటి సమాజంలో పిల్లలు ఫోన్, టీవీలకు బాగా అలవాటు పడిపోయారు. ఇక స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు. అయితే ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తున్నారని వారిని బుజ్జగించేందుకు టీవీ, స్మార్ట్ ఫోన స్ర్కీన్లపై వీడియోలు చూపించడం అలవాటు అయిపొయింది.
అయితే ఇంట్లో పిల్లలకు.. ఫోన్ స్ర్కీన్ చూపిస్తే తప్ప తినే పరిస్థితి లేదు. ఒక్క వేళా పిల్లలకి వారు అడిగింది ఇవ్వనుకుంటే ఏడుస్తారని, తప్పని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదోలా బుజ్జగించేందుకు ఈ విధంగా మభ్యపెడుతున్నారు. అయితే నిజానికి ఇలా చేస్తూ పోతే పిల్లలకు ఆరోగ్యానికి ఎంత ముప్పు వాటిల్లుతుందో గ్రహించలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఇక భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఇక టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ లను గంటల తరబడి చూస్తే.. అది పిల్లల ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే దానిపై యూనైటెడ్ నేషన్స్ ఏజెన్సీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. అంతేకాదు.. ఐదేళ్ల లోపు పిల్లలను రోజులో గంట కంటే ఎక్కువగా టీవీని చూడనీవద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక వీడియోలు, కంప్యూటర్ గేమ్స్ కు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ఓ సూచించారు. ఇక ఏడాది కంటే తక్కువ వయస్సు.. శిశువులను ఎలక్ట్రానిక్ స్క్రీన్ లను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచకూడదని తెలిపారు. అయితే వీటివల్ల రేడియేషన్ ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఐదేళ్ల లోపు పిల్లలను ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేలా వారితో ఆటలు ఆడించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: