అక్కడ ఎక్కువ కవలలే పుడతారా..?

MOHAN BABU
 సంతానం కోసం ఎంతో మంది భార్యాభర్తలు ఎదురుచూస్తూ ఉంటారు. ఒకరు పుడితే ఓకే.. కానీ ఒకే కాన్పులో ఇద్దరు పుడితే వారికి సంబరమే వేరు. మొదటి సారి అయినా.. రెండోసారి అయినా మళ్లీ కవలలు పుడితే అదో తెలియని ఆనందం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒకే కాన్పులో పుడుతున్న  కవల పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా  ఏటా పదహారు లక్షల మంది కవలలు పుడుతున్నారు. ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా దేశాల్లో ఈ కవల పిల్లల రేటు ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వెల్లడించారు. ప్రస్తుతం ఆఫ్రికాలో కవలలు  ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్-చైనాలే మొదటి స్థానంలో ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. 1980, 85, 2010, 15  మధ్య పుట్టిన కవలల ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. మొత్తం ప్రసవాలలో పుట్టిన కవలల శాతాన్ని అప్పటికీ ఇప్పటికీ పోల్చి చూశారు. ఏ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందని లెక్కించి ఈ నివేదికను తయారు చేశారు. కలలల సంఖ్యాపరంగా చూస్తే ఆసియా ఆఫ్రికా దేశాల్లోని ఎక్కువగా పుడుతున్నారని వెల్లడైంది. అంతే కాదు సహజంగా ఇప్పుడు కవలలు ఈ రెండు ప్రాంతాల్లోనే  ఎక్కువగా పుడుతున్నారు. అండం ఫలదీకరణ చెందిన తర్వాత రెండుగా విడిపోయి వేర్వేరు శిశువుగా ఎదగడం ఒకరకమైతే.

 ఒకే సారి రెండు అండాలు విడుదలై ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డై జైగోటిక్ పరిస్థితి ఏర్పడుతుందని, ఆక్స్ఫర్డ్   ప్రొఫెసర్ క్రిస్టియన్ తెలిపారు. 80 శాతం కవలలు ప్రపంచంలోనే ఆసియా ఖండంలో ఎక్కువగా పుడుతున్నారని తెలిపారు. 1980వ దశకంతో పోలిస్తే ఇప్పుడు కవలలు జన్మించడానికి గణనీయంగా పెరిగిందని  ఆక్స్ఫర్డ్. యూనివర్సిటీ  నిపుణులు  వారు చేసిన సర్వే    ద్వారా  తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: