బుడుగు: కరోనా నుండి పిల్లలను సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలివే..!

N.ANJI
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు పిల్లలను ఇంటి నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చిన్నారికి కొవిడ్-19 సోకితే, వారిని వెంటనే ఇతర కుటుంబ సభ్యుల నుండి వేరుగా చేసి (కుదిరితే), ప్రత్యేక గదిలో ఐసోలేట్ చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు. ఇక వీలైతే వీడియో కాల్స్ ద్వారా పిల్లలకు పాజిటివ్ టాక్ అందించే ప్రయత్నం చేయడం ఉత్తమం అని అంటున్నారు.
అయితే ఒకవేళ తల్లికి, పిల్లలకు ఇద్దరికీ కొవిడ్-19 పాజిటివ్ వస్తే, పిల్లలు తల్లి దగ్గర ఉండగలుగుతారని అన్నారు. ఇక తల్లికి అంత ఓపిక లేకపోయినా లేదా హాస్పిటల్ పాలైనా అది కుదరకపోవచ్చునని అన్నారు. అంతేకాక.. పిల్లలకు పాలివ్వడాన్ని తల్లులు కొనసాగించవచ్చునని అన్నారు. ఒకవేళ తల్లికి కొవిడ్-19 పాజిటివ్ అయ్యుండి, పిల్లలను సంరక్షించగల ఓపిక ఆమెకు ఉన్నట్లయితే, చిన్నారి నెగెటివ్ అయినా కూడా ఆమె తన పిల్లల సంరక్షణ చూడవచ్చునన్నారు.అంతేకాక.. ఇలా చేయాలనుకున్నప్పుడు మాత్రం పాజిటివ్ వచ్చిన తల్లి పూర్తి శానిటైజ్ రక్షణలు తీసుకోవాలన్నారు. అయితే వీలైనంత మేరకు మాస్క్ ధరించాలని చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం, కొవిడ్-19 నుండి పిల్లలను కాపాడటానికి ఉత్తమమైన దారి ఒక్కటే, అదేంటంటే కొవిడ్-19 సహిత ప్రవర్తనలైన సామాజిక దూరం, మాస్క్ ధరించడం, సబ్బుతో చేతులు కడుక్వడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించడం లాంటివి పాటించడం మాత్రమేనని అన్నారు. ఇక పిల్లల్లో కొవిడ్-19 నిర్వహణ గురించి డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అందించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐదేళ్లలోపు చిన్నారులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు, అయితే 6 నుండి 11 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్క్ ధరించాలని అన్నారు. అలాగే 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు తప్పకుండా మాస్క్ ధరించాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: