బుడుగు: పిల్లల్లో మానసిక ఒత్తిడిని ఇలా గుర్తించవచ్చు..!!

N.ANJI
నేటి సమాజంలో పిల్లలు త్వరగా మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారు. ఇక చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నారు. తాజగా ‘మానసిక ఒత్తిడి’ అనేది పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య. అయితే ఈ ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన చెందడం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావటం సహజం అని అంటున్నారు. అంతేకాక.. నెలల వయస్సు నుంచి మనిషి జీవితంలోని ప్రతి దశలో ఒత్తిళ్ళు తప్పవు అని అన్నారు. కాగా.. అదే ఆందోళన శృతి మించితే ఒత్తిడిగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ఈ ఆందోళన, ఒత్తిడి కొంతమంది పిల్లల్లో తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీయవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అయితే సాధారణంగా పిల్లల్లో ఒత్తిడిని గుర్తించటం చాలా క్లిష్టమైన పని. వారు ఎప్పుడు మానసిక ఒత్తిడికి గురయిన పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మరీ చిన్న పిల్లలో ఈ ఒత్తిడి నోట్లు వేలు పెట్టుకోవటం, జుట్టు మెలిపెట్టుకోవటం, ముక్కు గిల్లుకోవటం.. లాంటి ప్రవర్తనా సమస్యల ద్వారా బయట పడుతుంటుందని వెల్లడించారు.
ఇక అదే ఇంకొంచెం పెద్ద పిల్లలలో అబద్ధాలు చెప్పటం, తోటి పిల్లలని కొట్టటం, హింసించటం, పెద్దవాళ్లని ఎదిరించటం, రోజువారీ పనులు మరచిపోవటం, నిద్రలేమి, నిద్రలో మూత్ర విసర్జన, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు.. పిల్లలు చదివినది ఏదీ గుర్తుండకపోవటం, ఒక విధమైన నిరాశ, నిరాసక్తి గురి చేస్తుందన్నారు. ఇక పిల్లలకు ఏమీ చేయాలని అనిపించక పోవటం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏదో కోల్పోయిన భావన, తోటివారితో కలవలేక పోవటం, ఆత్మన్యూనతా భావం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: