బుడుగు: పరీక్షల సమయంలో పిల్లల్లో వచ్చే వ్యాధులు ఇవే..!

N.ANJI
సాధారణంగా పిల్లలు పరీక్షల సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. ఇక పరీక్షల తలనొప్పికి నిద్రలేమి ప్రధాన కారణం అవుతుంది. అయితే దీనిని ‘డోలో’ మాత్ర ఇస్తే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక వాటిని అవసరాన్ని బట్టి ఒకటి రెండు సార్లు ఇవ్వవచ్చును అని అంటున్నారు. అంతేకాదు.. కొంత మంది పిల్లల్లో దృష్టి లోపాల వల్ల కూడా తలనొప్పి రావచ్చునని అంటున్నారు. ఇక అంతకుముందు నుంచే ఆ సమస్య ఉన్నా, పరీక్షల సమయంలో రెట్టింపు ఒత్తిడి ఉండడం వల్ల తలనొప్పి రావచ్చు. అయితే ఈ స్థితిలో నేత్ర వైద్యుడిని కలవడమే పరిష్కారం అంటున్నారు.
అంతేకాదు.. చదువు తాలూకు  ఒత్తిడితో కూడా పిల్లల్లో గుండె దడ రావచ్చునని అంటున్నారు. అయితే సాధారణంగా ఈ ఒత్తిడి కొద్ది సేపట్లో దానంతట అదే తగ్గిపోతుందన్నారు. ఇక కొన్నిసార్లు ఆ దడ ఎక్కువ సేపు ఉంటే దాన్ని తీవ్రంగానే పరిగణించాలని అన్నారు. అలాగే కొంత మంది పిల్లల గుండె దడకు నిద్రలేమి కూడా కారణం కావచ్చునని అంటున్నారు. అయితే పిల్లల్లో థైరాయిడ్‌ సమస్యతో కూడా గుండె దడ రావచ్చునన్నారు. ఇక కొంత మంది పిల్లల్లో బాల్యం నుంచే గుండెకు సంబంధించిన  సమస్య ఏదైనా ఉండవచ్చునని తెలిపారు. అంతేకాదు.. విపరీతమైన ఆందోళనతో ఒత్తిడికి లోనై పరీక్షల సమయంలో పిల్లలకు జ్వరం రావచ్చునని అన్నారు.
పరీక్ష సమయంలో ఒత్తిళ్లతో కొందరు పిల్లలకు ఆకలి మందగిస్తే, మరికొందరికి ఆకలి పెరుగుతుందన్నారు. అయితే అతిగా తింటే మలబద్ధకం, ఇన్‌ఫెక్షన్లు తప్పవు అని అన్నారు. ఇక కడుపు ఉబ్బరంతో పాటు, వాంతులూ అవవచ్చునని అన్నారు. ఇక వారికీ  అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించాలన్నారు. అంతేకాదు.. మలబద్ధకాన్ని నిరోధించడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు ఇవ్వాలన్నారు. పిల్లలను చల్లని పదార్థాలకు దూరంగా ఉంచాలన్నారు. పిల్లలకు  గోరు వెచ్చని నీళ్లు తాగిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: