బుడుగు: పిల్లలు పడే ఇబ్బందులు తెలుసా..?

N.ANJI

చిన్న వయసులో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో వారికే తెలియదు. మీరు గమనించే ఉంటారు చిన్న పిల్లల ఆరోగ్యం బాలేనప్పుడు సరిగ్గా తిండి తినడు. అప్పుడు కొందరు తల్లులు తింటావా.. తినావా.. అన్నట్లు బెదిరిస్తే.. ఇంకొందరు ఎందుకు పిల్లాడు అన్నం తినడం లేదని గాబరా పడతారు. పిల్లలు ఆహారం తినకపోవడంపై చాలా కారణాలు ఉన్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో అన్న వాహికలో ఏమైన సమస్య తలెత్తిందా, హార్మోన్ల లోపం, ఆకలి సంబంధిత సమస్యలు, మలబద్దకం, అసిడిటి, థైరాయిడ్, కాలేయ సమస్య, కిడ్నీ సమస్యలు తదితర సమస్యలు వారిలో వచ్చాయనే విషయంపై ఆరా తీయాలి. పిల్లల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. చిన్న పిల్లలు ఏం చెప్పడం లేదని.. మీరు అలాగే నెగ్లెట్ చేస్తే వారి ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే క్రమం తప్పకుండా వారిని ఆస్పత్రికి తలించాలి. అలాగే వీరిలో శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలు వస్తుంటాయి. మానసిక ఆందోళనకు గురైనప్పుడు కూడా పిల్లలు ఆహారం తినలేరు.


 అప్పుడు తల్లిదండ్రులు గమనించి వారి మానసిక సమస్యను గుర్తించాలి. దగ్గరికీ తీసుకుని ఓర్పు, ప్రేమను పెంచుతాయి. ఎలాంటి సమస్య ఉన్నా వెనకుండి ధైర్యం ఇవ్వాలి. అన్నం తినడం లేదని బలవంతం చేయడం కన్నా.. సమస్య తీరినప్పుడు వాళ్లంత వాళ్లే ఆహారం తింటారు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇలాంటి కోణంలో ఆలోచించేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. తల్లిదండ్రులకు సమస్య అర్థమైతేనే.. పిల్లలకు సమస్య పరిష్కారం అవుతుంది. చిన్న పిల్లలు ఆటలు, పాఠలు పాగుతూ.. టైం వేస్ట్ చేస్తుంటారు. దీంతో వారికి ఆటల్లో పడి తక్కువగా తింటుంటారు. అదే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత టైం అయినా ఇంటికి వచ్చి తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: