బుడుగు: పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారా.. ఇలా చేయండి..!

N.ANJI
పరీక్షల సమయంలో పిల్లలు చాల ఒత్తిడికి లోనవుతుంటారు. సరిగ్గా తినరు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఈ చిట్కాలను పాటించడం చాల మంచిది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్య పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను విద్యార్థుల చేతిరాత నైపుణ్యాలను మెరుగపర్చడం, పరీక్షా కాలంలో వారిపై ఒత్తిడిని తగ్గించడం వంటి వాటిపై శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది. పరీక్షా కాలంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒత్తిడిని సమిష్టిగా ఎదుర్కోవడానికి BIC వరల్డ్ సీనియర్ యూజర్ రీసెర్చ్ మేనేజర్ ఎరిని పెట్రాటౌ కొన్ని సమర్థవంతమైన చిట్కాలను పేర్కొన్నారు. వాటిని పరిశీలిద్దాం.
ఇక పిల్లల పరీక్షల సమయంలో తల్లిదండ్రులుగా, మీరు కూడా కొంత ఒత్తిడికి గురికావడం సహజమే. కానీ, ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పరీక్షల ఒత్తిడిని మీతో పాటు, పిల్లల్లో రాకుండా జాగ్రత్తపడండి. మీ అబ్బాయిని/అమ్మాయిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమం తప్పకుండా చదవడం, రాయడం ప్రాక్టీస్ చేసేలా చూడాలి. చదివిన విషయాన్ని పెన్నుతో నోట్బుక్లో రాసుకుంటే ఎక్కువ సేపు గుర్తుంటుంది. దీని ద్వారా రాత వేగం కూడా పెరుగుతుందని గుర్తించుకోవాలి.
అంతేకాదు.. చాలా మంది తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. ముఖ్యంగా ఇతర విద్యార్థులతో పోల్చుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటారు. చదువుల్లో పోటీతత్వం మంచిదే అయినప్పటికీ అది ఆరోగ్యకరంగా ఉండాలని గుర్తించుకోండి. అంతేకాని పదేపదే ఇతరులతో పోలుస్తూ పిల్లలను మానసికంగా వేధించకూడదని నిపుణులు చెబుతున్నారు. విరామం లేకుండా నిరంతరం అధ్యయనం చేయడం చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది మెదడును అలసిపోయేలా చేస్తుంది. తద్వారా ఇది మీ పిల్లల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
అయితే పరీక్ష సమయాల్లో చాలామంది పిల్లలు ఎక్కువ గంటలు చదువుతుంటారు. ఈ కీలక సమయంలో వారు ఏ చిన్న అనారోగ్యం బారిన పడినా, ఆ ప్రభావం పరీక్షలపై పడుతుంది. అందువల్ల, వారిని జంక్ ఫుడ్కు దూరంగా ఉండేలా చూసుకోండి. అంతేకాక, మీ ఆహారంలో ఆరోగ్యకరమైన గింజలు, తాజా పండ్లు, ప్రోటీన్లు, ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: