బుడుగు: మొబైల్ ఫోన్లతో పెడదోవ పడుతున్న పిల్లలు..!?

N.ANJI
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా స్మార్ట్ ఫోన్ వల్ల క్షణాల్లో తెలిసిపోతుంది. అంతే కాదు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన బంధువులకు లేదా మనకు కావాల్సిన వారికి ఉత్తరం రాసి వారికి చేరిందా లేదా తిరిగి వారి వద్ద నుంచి సమాధానం వచ్చేందుకు పది రోజులకు పైగా పడుతుండేది. మరికొంత కాలం గడిచిన తర్వాత ల్యాండ్లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ల్యాండ్ ఫోన్ల వల్ల కొంచెం సాంకేతిక పరిజ్ఞానం సాధించాం. అప్పుడు ఎస్టిడి బూతులో వెళ్లి మనకు కావాల్సిన వారికి ఫోన్ చేసుకునే వాళ్ళం క్షేమ సమాచారాలు తెలుసుకునే వాళ్ళం. అలాంటిది ఏకంగా అరచేతిలో ఇమిడిపోయే ఒక మొబైల్ ఫోన్ కనిపెట్టి.. సాంకేతిక విప్లవం తీసుకొచ్చారు.
ఇక ఇంట్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి.. గేమ్స్ ఆడుకోమని ప్రోత్సహిస్తున్నాం. యూట్యూబ్, సోషల్ వ్యాప్స్, తదితర అంశాలపై స్మార్ట్ ఫోన్ లో పిల్లలు ఎక్కువగా వీక్షిస్తున్నారని ఇటీవల ఒక సర్వేలో వెల్లడయింది. ఆన్లైన్ గేమ్స్ కు పిల్లలు బానిస అయ్యి మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాదు తమ తల్లిదండ్రుల విలువ డబ్బులు కూడా ఆన్లైన్ గేమ్స్ లో కోల్పోయేలా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న వారు అశ్లీలమైన దృశ్యాలను చూస్తూ పెడదోవ పడుతున్నారు.
అంతేకాదు కొన్ని దేశాలలో ఆన్లైన్ గేమ్స్ లో గేమ్స్ ఇమేజినేషన్ లో ఉన్న హీరోలు చేస్తున్నట్టుగా చేసేందుకు ప్రయత్నించి.. మృత్యువాత పడ్డ సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అంతేకాదు కొన్ని దేశాలలో తమ తల్లి లేదా తండ్రి ప్రాణాలను ప్రమాదంలో పడిన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. మరి ఫస్ట్ మనం సాధించిన సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే.. ఏమీ తెలిసీ తెలియని వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్ అతిగా వాడుతూ ఉండటం వల్ల వారి భవిష్యత్తు పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటమే కాదు.. ఆ స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏమి చూస్తున్నారు అని తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత ఉందంటున్నారు. అంతే కాదు వారు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో వారి సంరక్షణలోనే వారి ఎదుటే వారికి కావాల్సిన సమాచారాన్ని చూసే లాగా ప్రోత్సహించాలని. అంతే కాకుండా పిల్లలకు ముందుగానే స్మార్ట్ ఫోన్స్ పై ఒక అవగాహన కల్పిస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడే కన్నా ఫిజికల్ ఫిట్నెస్ తో కలిగిన ఆటల ఆడేలా ప్రోత్సహించాలని అంటున్నారు. మానసిక వైద్యులు తమ పిల్లల్ని ప్రాణంగా చూసుకున్న తల్లిదండ్రులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: