బుడుగు: పిల్ల‌ల‌కు బ‌ల‌వంతంగా తినిపిస్తే జ‌రిగే ప్ర‌మాదం... ఏమిటంటే?

Arshu
ప‌సిపిల్ల‌ల‌కు బ‌ల‌వంతంగా ఆహారాన్ని తినిపించ‌కూడ‌దు. వాళ్ళు చాలు అన్న‌ప్పుడు ఆగిపోవ‌డం చాలా మంచిది. అలాగే అన్నం తినే ముందు చిరుతిళ్ళు ఇవ్వ‌కూడ‌దు. దాని వ‌ల్ల పిల్ల‌లు అన్నం స‌రిగా తిన‌లేరు. అన్నం తినే ముందు ఇత‌ర‌త్రా చిరుతిళ్ళు తిన‌డం వ‌ల్ల అనం స‌రిగా తిన‌లేక‌పోతే బ‌ల‌వంతంగా తినిపించ‌డం వ‌ల్ల వాళ్ళు వామిటింగ్ చేస్తారు. అంతేకాక చాలామంది పిల్ల‌ల‌కు తిన్న ఆహారం అర‌గ‌క క‌డుపులో నొప్పి వ‌చ్చి ఇబ్బంది కూడా ప‌డుతుంటారు. ఇలాంటి ఇబ్బందుల‌న్నీ కూడా జ‌రుగుతాయి. 

అందుకే ఎప్పుడూ కూడా పిల్ల‌లు తినే ముందు వారు ఎంత వ‌ర‌కు తిన‌గ‌ల‌రు అని చూసి ఆలోచించి మ‌రీ పెట్టాలి. అలాగే రాత్రి స‌మ‌యంలో అన్నం చాలా త్వ‌ర‌గా తినిపించాలి. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కూడదు. అలా ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల తిన్న అన్నం అర‌గ‌దు. దాంతో క‌డుపులో నొప్పి రావ‌డం ఇలాంటివ‌న్నీ జ‌రుగుతాయి. అదే త్వ‌ర‌గా తినిపించ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా అరిగిపోయి హాయిగా నిద్ర‌పోతారు.

అలాగే రాత్రి స‌మ‌యంలో ఎప్పుడూ కూడా బ‌ల‌మైన ఆహారాన్ని ఇవ్వ‌కూడ‌దు. అర‌గ‌ని ఫుడ్ పెట్ట‌డం వ‌ల్ల రాత్రంతా అది అరిగే స‌మ‌యంలో పిల్ల‌లు ప‌డే వేద‌న వేరుగా ఉంటుంది. అందులో నాన్‌వెజ్ ఫుడ్ అస్స‌లు పెట్ట‌కూడ‌దు. నాన్‌వెజ్ త్వ‌ర‌గా అర‌గ‌దు దాంతో క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. అప్పుడు పిల్ల‌ల క‌డుపు ప‌ట్టుకుంటే చాలా గ‌ట్టిగా ఉంటుంది. దాన్ని బ‌ట్టి మ‌నం అర్ధం చేసుకుని కొంచం కొబ్బ‌రి నూనె రాసి ప‌డుకోబెడితే పిల్ల‌ల‌కు ఎటువంటి ఇబ్బంది రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: