లోభం మహా చెడ్డది

Durga
 ఓ వర్తకుడు బేరగానికి తేనె అమ్ముతున్నాడు. అకస్మాత్తుగా అతని చేతిలోనుంచి తేనెగిన్నె జారి కింద పడిపోయింది. గిన్నెలోంచి తేనె వొలికి నేలమీద పడింది. వ్యాపారి సాధ్యమైనంత తేనె గిన్నెలోనికి పైపైన ఎత్తి పోసుకున్నాడు. కానీ కొంత తేనె మాత్రం నేలపాలయింది. తేనె తీపిదనానికి ఆశపడి ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి తేనెమీద వాలాయి, తియ్యిని తేనె రుచిమరిగి ఈగలు గబగబా తేనె జుర్రుకోసాగాయి.  కడుపు నిండిన తర్వాత ఈగలు ఎగిరిపోవాలని ప్రయత్నించాయి. కాని రెక్కలు తేనెకు అంటుకుపోయ్యాయిగా! ఎగరాలని ఎంతగానో ప్రయత్నించాయి. కాని ఎగరలేపోయ్యాయి. పాపం! ఎన్నో ఈగలు తేనెలో విలవిలలాడుతూ చనిపోయాయి, అయినా తేనెమీది ఆశకొద్దీ కొత్తగా ఈగలు గుంపులు గుంపులుగా రావటం మానలేదు. విలవిలలాడుతున్న, చనిపోయిన ఈగలను చూసైనా అవి బుద్ది తెచ్చుకొన్నాయా? ఈగలను అవస్థ, అవివేకం చూసి వర్తకుడు ఇలా అన్నాడు. ‘ జిహ్వచాపల్యానికి, లోభానికి, లోభానికి గురయ్యేవారు ఈగల్లాగానే మూర్ఖులు, క్షణికమైన ఆనందాన్ని ఆశించి, లోభం కొద్దీ తమ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. నానా రోగాలతో అవస్థపడుతుంటారు. త్వరలో చావు కొనితెచ్చుకొంటారు. ఈకథలోని నీతి : లోభ కష్టనష్టాలకు గురిచేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: