బుడుగు: పిల్లలు నిద్రపోవడానికి ఇలా చేస్తే మేలు..!!

N.ANJI
సాధారణంగా చిన్నపిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లల ఆహారం నుండి ఆరోగ్యంపై జాగ్రత్త పాటించాల్సి వస్తుంది. ప్రతి రోజు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. పిల్లలకు ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. నేటి సమాజంలో పిల్లలు సరైన నిద్ర పోవడంలేదు. వారు ఎక్కువగా మొబైల్ ఫోన్ కి అట్ట్రాక్ట్ అవుతున్నారు. దాని కారణంగా పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలు త్వరగా నిద్ర పోవాలంటే ఎం చేస్తే బాగుంటుందో ఒక్కసారి చూద్దామా.
సాధారణంగా పిల్లలు, పెద్దలు ఇంట్లో ఒకేసారి నిద్రపోతే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నిద్ర సమయం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక అందరూ ప్రతిరోజు ఒకే సమయంలో మేల్కోవడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు. ఇక ప్రతిరోజు 30 నుంచి 60 నిమిషాలు నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిదని చెబుతున్నారు. సాధారణంగా పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలని చెబుతున్నారు.
పిల్లలు నిద్రపోయే ముందు టీవీ చూడటం, సోషల్ మీడియా వాడటం, వీడియో గేమ్స్ లాంటివి అసలు చేయకూడదని అంటున్నారు. అలాగే పిల్లలకు అసలే ఇలాంటివి అలవాటు చేయకూడదని చెబుతున్నారు. అయితే నిద్రపోయే ముందు ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణం ఉంటే నిద్ర నాణ్యతగా ఉంటుందని తెలిపారు. ఇక పిల్లలు నిద్రపోయేటప్పుడు పూర్తి చీకటిగా ఉండకుండా నైట్ లైట్లు వినియోగించాలని చెబుతున్నారు.
అయితే కొందరు పిల్లలు, పెద్దల్లో స్లీపింగ్ డిజార్డర్లు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణకు పారాసోమనియాస్ ఉంటే నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడటం, పీడకలలు, తరచూ ఉలిక్కిపడి లేవడం లాంటివి చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఇక పెద్దల కంటే పిల్లల్లోనే ఇలాంటివి ఉంటాయని పేర్కొన్నారు. ఇక చాలా మంది పిల్లల్లో వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు తగ్గుతుందని అన్నారు. అయితే ఈ డిజార్డర్ వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తే తల్లిదండ్రులు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: