బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

N.ANJI
చిన్న పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా తల్లులు ఏడాది వయసులో ఉన్న పిల్లలకు పాలివ్వడం కొనసాగించాలని వైద్యులు తెలియజేస్తుంటారు. ఇక వాటితోపాటు పిల్లలకు ఫుడ్ ప్రారంభించాలనే తల్లిదండ్రులు కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు. పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే మంచిది కాదో ఒక్కసారి చూద్దామా.
అయితే సాధారణంగా ఏడాదిలోపు పిల్లలకు స్వీట్లు ఇవ్వడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తేనే ఇస్తూ ఉంటారు. కానీ అది కూడా మంచిది కాదని చెబుతున్నారు. అంతేకాదు.. తేనే నెయ్యిలో ఉండే బ్యాక్టిరియాను పిల్లలకు గ్రహించే శక్తి ఉండదని అన్నారు. ఇక  తేనే తింటే మలబద్దకం వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. అలాగే పండ్ల కూరగాయలు పెద్దల ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచి కావు. అయితే  చిన్న పిల్లల కడుపులో యాసిడ్ ఇంకా ఉత్పత్తి కాకపోవడం వలన పిల్లలకు కూరగాయలు పెట్టకూడదు. అంతేకాదు.. ముఖ్యంగా బీట్ రూట్ వంటి కూరగాయలు ఇవ్వకూడదని తెలిపారు.
అలాగే సంవత్సరంలోపు ఉండే చిన్నపిల్లలకు ప్రతిరోజు ఒక గ్రాము కంటే ఎక్కువ ఇస్తే వారి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. అంతేకాదు.. రొమ్ము పాలలో అయితే పిల్లల ఆరోగ్యానికి తగినంత పదార్థాలు ఉంటాయని వెల్లడించారు. ఇక ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లలకు జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ ఇవ్వటం మంచిది కాదు. వాటిని పెట్టడం వలన అలర్జీలు భారీ ప్రమాదాన్ని కల్పిస్తాయని వెల్లడించారు.
ఇక పిల్లలు అడగ్గానే చాక్లెట్లు ఇవ్వకూడదని అన్నారు. చాక్లెట్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకం మారుతుందని చెప్పుకొచ్చారు. అందుకే చాక్లెట్‌ను ఒక సంవత్సరం వరకు పిల్లలకు దూరంగా ఉంచాలని అంటున్నారు. అంతేకాక.. పిల్లలకు ఏడాది వయస్సు వచ్చే వరకు ఆవుపాలు, సోయామిల్క్ వంటివి ఇవ్వడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: