అనగనగా ఒక చిట్టడవి!

Durga
అనగా అనగా ఒక చిట్టడవి ఆ అడవిలో ఒక పిచ్చుక దానికి తోడుగా ఒక కాకి ఉన్నాయి. పిచ్చుకది పిడకల యిల్లు.  కాకిది కట్టెల ఇల్లు. రెండూ సుఖంగా ఉండేవి.
ఒకసారి పిచ్చుక కాకి దగ్గరకు వెళ్ళి “కాకి బావా కాకిబావా!” అని పిలిచింది కాకి “ఆ ఏమిటి అంటూ బయటికి వచ్చింది.

ఆ ఏమీ లేదు అందరూ చేలు వేసుకుంటున్నారు కదా మనమూ వేసుకుందామా..? అని అంది పిచ్చుక ఆలోచించిన కాకి ఆ వేసుకుందాము అంది. కాకి మొక్కజొన్న చేను వేసింది, పిచ్చుక సెనగ చేను వేసింది. సోమరిపోతు అయిన కాకి సరిగ్గా కష్టపడేది కాదు అయినా పిచ్చక కష్టంతో రెండు చేలూ ఏపుగా పెరిగాయి ఇంతలో ఉన్నట్టు వుండి ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది కాకి కట్టెల యిల్లు ఎగిరిపోయింది. మొగ్గజొన్న పొడుగుగా ఉండటంవల్ల గాలికి వంగిపోయి పాడైపొయింది.

పిచ్చుకదేమో పిడకల గూడు కదా గాలికి చెక్కు చెదరలేదు. సెనగ పంట పొట్టిగా ఉంటుంది గదా. వానకు పాడవలేదు. పిచ్చుక ఇల్లు, చేను చూచిన కాకికి కన్ను కుట్టింది ఎట్లాగయినా ఆ రెంటినీ కాజేయాలనుకుంది మరి మన పిచ్చుకేమో అమాయకపుది కదా కాకి పోట్లాటకు సై అంది పిచ్చుక తుర్రుమంది కాకి పెద్దదవటం వల్ల పిచ్చుకని కొట్టి పిచ్చుక ఇల్లూ, చేనూ ఆక్రమించుకుంది. పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ వెళ్ళుతున్నది దారిలో దానికొక పాముపుట్ట కనిపించింది కాకిచేత ఇన్ని దెబ్బలు తిన్నాను ఇక బ్రతికేకంటే పాము చేత కరిపించుకొని చచ్చి పోవటం మంచిది అనుకొంది మన బంగారు పిచ్చుక.

ఏడుస్తూ పుట్టదగ్గరకు వెళ్ళి రంధ్రంలో వేలు పెట్టింది ఎంత సేపు అలా ఉంచినా పాము కరవలేదు , ఎందుకు కరవలేదబ్బా అనుకుంటూ వేలు తీసి చూసింది అరే మన బంగారు పిచ్చుక వేలికి బంగారు ఉంగరం వచ్చింది దానిని చూసి పిచ్చుక ఎగిరి గంతులేసంది మరలా కొంచ్చంసేపటికి అయ్యో ఇది నాది కాదు కదా! పాముది దానికే ఇచ్చేదాము అనుకొని ఇంకోసారి పాము పుట్టలో వేలు పెట్టింది కొంచెం సేపటికి మళ్ళీ తీసింది మళ్ళీ మరో వేలికి ఇంకో బంగారు ఉంగరం వచ్చింది.

ఆ రెండు ఉంగరాలు తీసుకుని పాముకు నమస్కారం తెలియచేసి వేరే ఇల్లు కట్టుకుందామని సంతోషంగా వుళుతున్నది . మార్గమద్య దారిలో కాకి పిచ్చుకని చూసి దాని దగ్గర ఉన్న బంగారు ఉంగరాలు చూచింది. కాకి ఎంతో ఆశ్చర్యపోయింది దుర్బుద్దితో వాటిని కాజేయాలని మెల్లగా పిచ్చుక దగ్గరకు చేరింది చేరి కపటం నటిస్తూ

"పిచ్చుక బావా పిచ్చుక బావా ! "నిన్ను కోపంలో కొట్టాను ఏమీ అనుకోకు అది సరేగాని ఇంతకు ఆ బంగారు ఉంగరాలు ఎక్కడివో చెప్పవా ?అని అడిగింది.
దాని కపట వేషం తెలియని అమాయకపు పిచ్చుక పాముపుట్టలో వేలు పెడితే దొరికాయి అని చెప్పింది కాకికి దురాశ పుట్టింది పిచ్చుక కంటే ఎక్కువ బంగారం తెచ్చుకోవాలి అనుకొంది పిచ్చుకతో చెప్పా పెట్టకుండా గబగబ పాము పుట్టలో వేలు పెట్టింది దానిలో ఉన్న పాము అది గ్రహించి కోపంతో కరిచంది పాపం కాకి కెవ్వుమని అరిచి అక్కడి నుండి పారిపోయింది 
పిచ్చుక మళ్ళీ తన పిడకల ఇంటికి వచ్చి కాకి జొన్న చేను ను తన సెనగ చేనును చూసుకుంటూ చాలా సుఖంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: