మట్టిబుర్ర సోమనాధం!

Durga
రామాపురం లో నివసించే సోమనాధాన్ని ఆ ఊరి ప్రజలంతా మట్టిబుర్ర సోమనాధం అని పిలిచేవారు. కానీ, వారి మాటలను కొంచెం కూడా పట్టించుకునే వాడుకాదు. ఇలా ఉండగా ఒకరోజు పొరుగూరినుండి అల్లుడ్ని చూద్దామని తన మామాగారైన సింగినాధం వచ్చాడు. ఆఊళ్ళో వారందరూ తన అల్లున్ని మట్టిబుర్ర సోమనాధం అని పిలవటం చూసి చాలాబాధపడ్డాడు. జనం అంతా తన అల్లుడిని అలా ఎందుకు పిలుస్తున్నారో... కొంచెం కూడా అర్థం కాలేదు. వెళ్లి ఆ విషయాన్ని అల్లుడిని అడుగుదాము అనుకున్నాడు. కానీ అడిగితే అల్లుడు ఏమైనా అనుకుంటాడేమో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఒక రోజు సాయంత్ర ఏదో పనిమీద బయటకి వెళుతున్న సింగినాదం దగ్గరకు సోమానాదం వచ్చి మామా గారు... ఇంట్లో మీ పది రూపాయల నోటు దొరికింది. తీసుకోండి అని జాగ్రత్తగా అందజేశాడు. అల్లుడి నిజాయితికి ఎంతో సంతోషించి సింగినాధం ఆ పదిరూపాయల నోటుని అందుకుంటూ అవును ఇ పదిరూపాయల నోటు నీకు ఎక్కడ దొరికింది అల్లుడు? అని అడిగారు. వెంటనే సోమనాధం మరేమి తడుముకోకుండా గోడకు తగిలించి ఉన్న మీ చొక్క జేబులో మామయ్య అన్నాడు అమాయకంగా అంతే... అల్లుడు చెప్పిన సమాధానం విన్న సింగినాధానికి నెత్తిమీద పిడుగుపడ్డట్లయి ఆ ఊరి ప్రజలంతా తన అల్లుడ్ని మట్టి బుర్ర సోమనాధం అని ఎందుకు అంటున్నారో అప్పుడు అర్థం అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: