ట్రెక్కింగ్ కు వెళ్లి చరిత్రలోనే అంతుపట్టని మిస్టరీగా...!

Vimalatha

స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లిన ఓ బృందం చరిత్రలోనే అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది. ఆ రోజు ఏమి జరిగింది? అక్కడ కనిపించని శక్తి ఉందా? 60 సంవత్సరాల తర్వాత కూడా మనస్సులో తలెత్తుతున్న ప్రశ్న. రష్యాలో, ఉరల్ పర్వతాలలో మరణం ఇప్పటికి, 60 సంవత్సరాలు గడిచినప్పటికీ మిస్టరీగానే మారింది. ఆ రాత్రి ఏమి జరిగిందో ఇప్పటికీ తెలియదు. ట్రెక్కింగ్, క్యాంపింగ్ కోసం వచ్చిన తొమ్మిది మందిలో ఒక్కరు కూడా తిరిగి వెళ్లలేరు.
మనం Dyatlov పాస్ ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాము. 1959 లో ఫిబ్రవరి 1, 2 మధ్య రాత్రి 9 మంది రష్యన్ హైకర్లు మరణించారు. వాళ్ళు ఎలా చనిపోయారనే మిస్టరీ నేటికీ వీడలేదు. రెస్క్యూ టీమ్ కూడా చూసి వణికిపోయిన ఆ మృత దేహాలు చాలా భయంకరమైన స్థితిలో పడి ఉన్నాయి. మృత దేహాలను చూసినప్పుడు మంచు తుఫాను లేదా చలి కారణంగా ఎవరూ అలాంటి స్థితిలో చనిపోరని అనిపించింది. దీంతో పలు ఊహాగానాలు విన్పించాయి. యతి (స్నో మ్యాన్) వచ్చి వాళ్ళను చంపేశాడని, గ్రహాంతరవాసులు,  మంచు తుఫాను లేదా అదృశ్య శక్తి ఇలా ఎవరికీ నచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకున్నారు.
10 మంది హైకర్ల బృందం (2 అమ్మాయిలు, 8 మంది అబ్బాయిలు) ఉరల్ కొండలపై క్యాంపింగ్‌కు వెళ్లారు. వారిలో ఒకరు అస్వస్థతకు గురై తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 1, 2 రాత్రి, ఏమి జరిగిందో తెలియదు. అనుకున్న సమయానికి వారు తిరిగి రాలేదు . దీంతో తిరిగి వెళ్లిన రెస్క్యూ బృందం వారి మృతదేహాలను శిబిరానికి దూరంగా గుర్తించింది. వారిలో ఒకరికి తలకు బలమైన గాయమైంది. ఇద్దరి ఛాతీని చీల్చేశారు. ఇద్దరు యువకుల కళ్లు రెండు బయటకు తీసేశారు. ఒకరి నాలుక లేదు. మరొకరికి కనుబొమ్మలు లేవు.
ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. 2019 సంవత్సరంలో రష్యా ఈ సంఘటనపై కొత్తగా దర్యాప్తు ప్రారంభించింది. ఇది జూలై 2020లో పూర్తయింది. హిమపాతం (మంచు తుఫాను) కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఈ దర్యాప్తులో తేల్చారు. గత నెలలో విడుదలైన ఒక అధ్యయనంలో కూడా భారీ మంచు ముక్క వాళ్ళ వైపు జారిందని. దీని కారణంగా వాళ్ళు ఇంత తీవ్రమైన గాయాల పాలయ్యారని చెప్పింది. అయితే ఈ వ్యక్తుల కుటుంబాలు ఇప్పటికీ ఈ సిద్ధాంతాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే మంచు అలా కళ్ళు, నాలుక పీకి, ఛాతీని చీల్చేయలేదు కదా !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: