సెప్టెంబర్ 20 : చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

Purushottham Vinay
చరిత్ర అనేది చాలా ముఖ్యమైనది. చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఓ ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి చరిత్రలో ప్రతి రోజు జరిగిన సంఘటనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక చరిత్రలో ఈ నాడు ఏం జరిగిందో అలాగే ప్రముఖుల జాననాలు ఇంకా మరణాల గురించి తెలుసుకోండి.

చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..
1519 : పోర్చుగీస్ నావిగేటర్ ఫెర్డినాండ్ మాగెల్లాన్ నేతృత్వంలోని స్పానిష్ యాత్ర భూగోళం  1 వ విజయవంతమైన ప్రదక్షిణను ప్రారంభించింది.
1854 అల్మా యుద్ధం: క్రిమియన్ యుద్ధం మొదటి ప్రధాన యుద్ధం. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ కూటమి రష్యన్లను ఓడించింది.
1990 : తూర్పు మరియు పశ్చిమ జర్మనీ రెండూ పునరేకీకరణను ఆమోదించాయి.
2001: కాంగ్రెస్ మరియు అమెరికన్ ప్రజల ఉమ్మడి సెషన్‌లో ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ "తీవ్రవాదంపై యుద్ధం" ప్రకటించారు.
2019 : 185 దేశాల విద్యార్థులు వాతావరణ మార్పులపై ప్రపంచంలోనే అతిపెద్ద నిరసనను గ్రెటా థన్‌బర్గ్ నేతృత్వంలోని మాన్హాటన్ ర్యాలీలో ముగించారు.
చరిత్రలో ఈ నాడు జరిగిన ప్రముఖుల జాననాల విషయానికి వస్తే..
1569 : జహాంగీర్ జన్మించారు.ఈయన మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి.
1914: అయ్యగారి సాంబశివరావు జన్మించారు.ఈయన ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు.
1924: అక్కినేని నాగేశ్వరరావు జన్మించారు. ఈయన తెలుగు నటుడు, నిర్మాత.
1944: అన్నయ్యగారి సాయిప్రతాప్ జన్మించారు. ఈయన భారత పార్లమెంటు సభ్యుడు.
1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం జన్మించారు. ఈయన తెలుగు సినిమా హాస్యనటుడు.
1956: వంశీ జన్మించాడు. ఈయన తెలుగు సినిమా దర్శకుడు ఇంకా రచయిత.
చరిత్రలో ఈ నాడు జరిగిన ప్రముఖుల మరణాల విషయానికి వస్తే..
1933: అనీ బెసెంట్ మరణించడం జరిగింది.ఈయన హోంరూల్ ఉద్యమ నేత.
1999: టి.ఆర్.రాజకుమారి మరణించడం జరిగింది. ఈమె తమిళ సినిమా నటి.
2013: ఛాయరాజ్ మరణించడం జరిగింది. ఈయన కవి ఇంకా రచయిత.

ఇక చరిత్రలో ఈ రోజుని రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం గా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: