9/11 చ‌రిత్ర‌లో అతిపెద్ద ఉగ్ర‌మార‌ణ హోమం..

Paloji Vinay
చరిత్రలోనే ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ఉగ్ర‌దాడుల్లో అతిపెద్ద ఉగ్రదాడి సెప్టెంబర్ 11న జ‌రిగిన ట్విన్ ట‌వ‌ర్స్‌పై ఉగ్ర‌మార‌ణ హోమం. 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట భవనాల్లోకి హైజాక్‌ విమానాల ద్వారా ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడులు చేశారు. ఈ దాడిలో ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య అత్య‌ధికం. 9 11 దాడిలో గాయ‌ప‌డ్డ, చ‌నిపోయిన వారికి నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వెల్లువెత్తాయి. వీసీఎఫ్‌(విక్టిమ్‌ కాంపంజేషన్‌ ఫండ్‌) ద్వారా 40 వేల మందికి పైగా న‌ష్ట‌పరిహారంగా దాదాపు 9 బిలియన్ల డాలర్లను అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య తెలిపారు.
 
     
  వ‌రల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌ను కూల్చి అమెరికా చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ఉగ్ర‌మార‌ణ హోమానికి అల్‌ఖైదా ఉగ్ర‌వాద సంస్థ కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ స‌మ‌యంలో అమెరికా చేసిన ప‌లు ప‌నుల వ‌ల్ల ఈ దాడి జ‌రిగిఉండ‌వ‌చ్చే అనుమానం ఉంది. ఇందులో ఇజ్రాయెల్‌లో అగ్ర‌రాజ్యం స్నేహం, సోమాలియా, మోరో అంతర్యుద్ధం, ర‌ష్యా, లెబ‌నాన్‌, క‌శ్మీర్ ల‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, ముస్లీంల అణ‌చివేత‌, ఇస్లాం వ్య‌తిరేక కుట్ర‌ల‌కు అగ్ర‌రాజ్యం అమెరికా స‌పోర్ట్‌గా ఉంద‌ని అల్‌ఖైదా ఆరోప‌ణ‌. అలాగే సౌదీ అరేబియాలో యూఎస్ భ‌ద్ర‌తా ద‌ళాల మోహ‌రింపు, ఇరాక్ కు వ్య‌తిరేకంగా ఆంక్ష‌లు.. త‌దిత‌ర కార‌ణాల‌తో అల్‌ఖైదా అమెరికాను టార్గెట్ చేసి దాడులు చేసింద‌నే వాద‌ను కూడా ఉంది.
 
     
      పక్కా ప్రణాళికతో అల్‌ఖైదా దాడులు చేసింది. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులను ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విభ‌జించింది. సెప్టెంబర్‌ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేసిన ఉగ్ర‌వాదులు.. మొదటి విమానం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌11తో.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నార్త్‌ టవర్‌ను కూల్చివేశారు. పదిహేడు నిమిషాల తర్వాత వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సౌత్‌ టవర్‌ను రెండో విమానం(యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 175) ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల జంట భ‌వ‌నం చూస్తుండగానే నేల‌మ‌ట్టం అయింది.


   డల్లాస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన ఫ్లైట్‌ను ఓహియో వద్ద హైజాక్ చేసిన ఉగ్రవాదులు వర్జీనియా అర్లింగ్‌టన్‌ కౌంటీలోని పెంటగాన్‌ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు పేల్చారు.  ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్‌విల్లే దగ్గర మైదానాల్లో  నాలుగో విమానం కూలిపోయింది. ఒక‌వేళ‌ ఇది వైట్‌ హౌజ్‌ లేదంటే యూఎస్‌ పార్లమెంట్‌ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని అనుమానించారు. భావిస్తున్నారు. భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని మార‌ణ‌హోమం సంభవించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: