కలల భారతం: ప్రజలందరికీ ఉపాధి కల్పన..?

Pulgam Srinivas
నేటితో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు చేసిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అని చెప్పవచ్చు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని బ్రిటిష్ వారితో పోరాడి జైల్లో నాలుగు గోడల మధ్య బానిసల జీవించి తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించి మనకు స్వతంత్రాన్ని తెప్పించారు. ఆ మహానుభావులు దేశానికి స్వతంత్రం వచ్చినట్లయితే  భారత  పౌరులంతా సుఖ సంతోషాలతో ఉంటారని, పౌరులందరికీ కనీస వసతులు అయిన విద్య , వైద్యం, కరెంట్, రోడ్డు వసతులు ఉపాధి అవకాశాలు అందుతాయని భావించారు. మరి ప్రస్తుతం ఆ మహానుభావులు కన్నా కలలు అన్ని నెరవేరాయ అని అంటే మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. స్వతంత్ర సమరయోధులు కలలుకన్న వాటిలో ఒక ముఖ్యమైన అంశం దేశ ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం.. ఉపాధి అవకాశాల ద్వారానే ప్రజలు మెరుగైన జీవనాన్ని గడుపుతారు అని.. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వారికి కలుగుతుంది అని వారు భావించారు . స్వతంత్ర సమరయోధులు కలలుకన్న విధంగానే స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వాలు కూడా జనాలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి అనేక పథకాలను తీసుకువచ్చారు.

 ఈ పథకాల ద్వారా దేశ పౌరులందరికీ ఉపాధిని కల్పించడమే ప్రభుత్వాలు ధ్యేయంగా పెట్టుకున్నాయి. ప్రభుత్వాలు ఈ పథకాల ద్వారా మరియు ప్రైవేట్ కంపెనీల ద్వారా మరియు ఇతర రంగాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇప్పటికీ కొంత మంది మాత్రం ఇవి దూరంగానే ఉంటున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం మరియు ఇతర రంగాల ద్వారా ఉపాధి అవకాశాలను పొందని వారిని గుర్తించి వారికి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: