శ్రావణ మాసానికి ఇంత విశిష్టత ఉందా..?

MOHAN BABU
శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఇంట్లో పూజలు, ఆరాధనలు, భజనలతో మార్మోగిపోతోంది. ఉపవాస దీక్షలతో నిష్టతో దేవుళ్ళ ప్రార్థిస్తారు. ఈ విధంగా  శ్రావణ మాసాన్ని  ఒక పూజల మాసంగా మార్చేశారు. ఏదైనా  పని మొదలు పెట్టాలన్న శ్రావణమాసం శుభసూచకంగా ఉంటుంది. శుభకార్యాల కానీ, కొత్త గృహ నిర్మాణాలు కానీ, ఏదైనా బిజినెస్ లు కానీ ఇతరత్రా ఏవైనా శ్రావణ మాసంలోనే మొదలు పెడితే మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. మొన్నటి వరకు కరోణ విజృంభణ కారణంగా చాలా శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం కరోణ తాకిడి తక్కువ ఉండడంతో వివాహాది శుభకార్యాలు చేసుకునేవారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. ఆంక్షల నేపథ్యంలో  థర్డ్ వేవ్ ఆగస్టు లో వస్తుంది అన్నా ఆరోగ్య నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లకు వేలాది జంటలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ నెలలో శుభకార్యాలకు ముహూర్తాలు కూడా మొదలయ్యాయి. సోమవారం రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో గృహప్రవేశాలు, వివాహాలు, ఇతరాత్ర శంకుస్థాపనలు  వంటి శుభకార్యములకు  మంచి సమయం వచ్చింది. ఆషాడ మాసం ముగిసి, శ్రావణ శోభ సంతరించుకున్న సమయంలో మంగళ గౌరీ వ్రతాలు చాలామంది చేస్తారు.

మరోవైపు  ఎక్కువ మొత్తంలో పెళ్లి బాజాలు మొగనున్నాయి. శ్రావణ శుక్రవారాలు రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో  పాటు పెళ్లి వంటి శుభకార్యాలకు మంచి శుభ ముహూర్తాలు ఉండడంతో మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. శ్రావణమాసం నెల  రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండడం, ఆ తర్వాత వచ్చే భాద్రపదమాసంలో శుభ ముహూర్తాలు ఆస్కారం లేదని, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. భాద్రపద మాసంలో శుభ ముహూర్తాలు ఎక్కువ ఆస్కారం లేదని, వాస్తు జ్యోతిష్యం చెబుతున్నారు. భాద్రపద మాసాన్ని శూన్య మాసంగా  పేర్కొనడంతో ఆశ్వయుజ మాసంలో మళ్లీ శుభముహూర్తాలు ఉన్నాయి.

 శ్రావణ మాసంలో పెళ్ళిల్లు భారీగా జరుగుతుండడంతో బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారాలు మరియు కళ్యాణ మండపాలు, టెంట్ హౌస్ లు, ఇతరాత్రా చిన్నాచితక వ్యాపారాలు  చేసేవారికి గిరాకీ పెరిగింది అని చెప్పవచ్చు. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో  పెళ్లిళ్ల శోభ సంతరించుకుంది. ఈనెల 9వ తేదీ నుంచే  వివాహ ముహూర్తాలు మొదలై  సెప్టెంబర్ 7వ తేదీ వరకు  ముహూర్తాలు ఉంటాయని ఇది పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుకూలమైన సమయమని  పండితులు తెలుపుతున్నారు. ఇలా ఒక వైపు పండుగలు, మరోవైపు శుభ కార్యాలు ఉండడంతో అన్ని వర్గాలకు పనులు దొరుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: