త్యాగానికి ప్రతీక.. మానవ విశ్వాసానికి దైవ పరీక్ష బక్రీద్..!

MOHAN BABU
త్యాగానికి ప్రతీక మానవ విశ్వాసానికి దైవ పరీక్ష బక్రీద్ పండగ. ఇస్లామిక్ ధర్మ శాస్త్రం ప్రకారం  ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. మొదటి రంజాన్, రెండవది బక్రీద్. ప్రపంచంలోని ముస్లింల పవిత్ర పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై 21వ తేదీన జరుపుకుంటారు. ఈ పండగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. మమతానురాగాల స్ఫూర్తినిచ్చే బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సన్నద్ధమయ్యారు.

ఇప్పటికే పట్టణాలు గ్రామాల్లో బక్రీద్ పండుగ సందడి నెలకొంది అని చెప్పవచ్చు. ఈ ఏడాది కోవిద్ ఉధృతి కారణంగా, ఈద్గాలలో  బహిరంగ ప్రదేశాలలో నమాజులు, ఆలింగనం, చేతులు కలుపుకోవడం గుంపులుగా చేరడం వంటివి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.  అయితే ప్రతి ఒక్కరు తమ తమ ప్రాంతాల్లోని మసీదులో రెండు మీటర్ల దూరం పాటిస్తూ ఎవరికి వారు జెమినీ మోజులు వారి ఇంటి వద్ద నుండి తెచ్చుకుని నమోదు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటించి పండుగను జరుపుకోవాలని అధికారులు కోరారు. బక్రీద్ కి  ఒక ప్రత్యేకత ఉంది . మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు  ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ఈద్ ఉల్ అజాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి.

 ఈ పండుగకు హజ్, కుర్బానీలకు మూలకారణం హాజట్ ఇబ్రహీం  అలీహి సలాం  తన కొడుకు ఇస్మాయిల్ అలీహి సలాం కర్బానీ ఇచ్చేందుకు సిద్ధమై  దేవుడు విశ్వాసాన్ని చురగోట్టాడు. కొడుకుది కుర్బానీ ఇస్తున్న క్రమంలో దేవుడు వర్గం నుంచి హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలామ్ త్యాగం గుర్తుగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకుంటారని దీనికి పొట్టేలు, మేకపోతులను కుర్బానీ ఇస్తారని, తమ తోటి వారికి బంధువులకు స్నేహితులకు కుర్బాని ద్వారా మాంసం అందజేస్తారని బక్రీద్ పండుగ ప్రతీక. ప్రస్తుతం కరోనా ప్రభావంతో నిబంధనలతో ఈ పండుగ జరుపుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: