జ‌న‌వ‌రి 6వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 6వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..
1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
ప్ర‌ముఖుల జననాలు
1812: బాలశాస్త్రి జంబేకర్, భారతీయ సంఘ సంస్కర్త.
1867: బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది, దాత
1910:  జీఎన్‌ బాలసుబ్రహ్మణ్యం, భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960)
1932: బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.
1936: జి. మునిరత్నం నాయుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1959: కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్.
1966: ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకులు.
1989: హెబ్బా పటేల్, భారతీయ చలనచిత్ర నటీమణి.

మరణాలు
1847: త్యాగయ్య, ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
1852: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)
1884: గ్రెగర్ మెండల్, జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
1919: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
1949: చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
1976: యనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
1994: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
2009: జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
2011: ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922)
2013: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
2014: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
2017: ఓం పురి, భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: