చరిత్రలో ఈ రోజు

DRK Raju
సెప్టెంబర్ 28 న చరిత్రలో పండుగలు మరియు జాతీయ దినాలను పరిశీలిస్తే.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అదే విధంగా ఇదే రోజు గన్నర్స్ డే కూడా.  ఇక ఈనాటి సంఘటనలు ఏంటంటే.. 1745 లో  బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు. 1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో  భారీగా ఆస్తినష్టం జరిగింది. 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది. 2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.



చరిత్ర పుటల్లో ఈ రోజు జన్మించిన వారు వీరే..1895: గుర్రం జాషువా, ప్రముఖ తెలుగు కవి. (మ.1971), 1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931), 1909: పైడి జైరాజ్, భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000), 1915: స్థానాపతి రుక్మిణమ్మ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి. 1929: లతా మంగేష్కర్, గాన కోకిల. 1987: హిల్లరీ డఫ్, అమెరికా నటి మరియు రికార్డింగ్ కళాకారిణి.  ఇక ఈ రోజు అసువులుబాసిన వాళ్ళను కూడా ఒక సరి స్మరించుకుంద్దాం.. 1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822).,



1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు., 1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890)., 1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ  రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (జ.1911).,1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)., 2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905)., 2006: ఎస్. వి. ఎల్. నరసింహారావు,  ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)., 
2007: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు. (జ.1920).

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: