ఉల్లిగడ్డ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.ఈ ఉల్లిగడ్డని ఉల్లిపాయ అని కూడ పిలుస్తారు.ఎవరిని అడిగినా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ఉల్లి గురించి చెప్తారు. ఎందుకంటే ఈ ఉల్లి లేకుండా ఏ వంటకం మొదలవ్వదు కాబట్టి.అయితే ఉల్లిగడ్డ ఒక్క వంటగదికి మాత్రమే పరిమితం కాదు.దీనిలో మనకి తెలియని ఎన్నో అద్భుతమైన ఔషద గుణాలున్నాయని మీకు తెలుసా?అయితే ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.దీన్ని బట్టే అర్ధం అవుతుంది ఈ ఉల్లికి ఈ బిరుదు ఎందుకు ఇచ్చారో అని.అంత మంచి ఔషద గుణాలు కలిగి ఉడటం వల్లే దీనికి ఆ గుర్తింపు వచ్చింది. ఇక పోతే ఇన్ని గుణాలు కలిగిన ఈ ఉల్లి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉల్లిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఇది మంచి ఆంటిబయోటిక్ గా పని చేస్తుంది.దీనిలో ఆంటీఫంగల్, ఆంటిబ్యాక్టీరియల్ పుష్కళంగా ఉన్నాయి.అంతేకాదు దీనిలో ఎక్కువ మొతాదులో సల్ఫర్,అమోనియా వున్నాయి.
అందుకే మనం ఉల్లిగడ్డని కోసినప్పుడు దీనిలో సల్ఫర్,అమోనియా,ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఆవిరి ఘాటుకు మన కళ్ళలో నీళ్లు వస్తాయి.అయితే ఈ ఉల్లి రసం జుట్టు సమస్యలకి బాగా పని చేస్తుంది.తలలో చుండ్రుని నివారిస్తుంది.ఈ రసం జుట్టుకి మాడుకి బాగా పట్టించడం వల్ల,సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఉల్లిని పేస్ట్ లా చేసి తలకి ప్యాక్ లా పెట్టుకుంటే కురులు మృదువుగా తయారయ్యి నిగనిగలాడతాయి.ఈ ఉల్లిగడ్డని ముక్కలుగా చేసి కొబ్బరినూనెలో వేసి వేడి చేసి గోరువెచ్చని నూనెని జుట్టుకి మాడుకి అప్లే చేసి మర్ధన చేయడం వల్ల బ్లెడ్ సర్కెలేషన్ బాగా జరిగి పొడవైనా అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.డైలీ ఉల్లిపాయ తినడం వల్ల చర్మసమస్యలు రాకుండా చర్మం ఎల్లపుడు సురక్షితంగా కాంతివంతంగా ఉంటుంది.మన పెద్దవాళ్ళు మజ్జిగన్నం లో పచ్చి ఉల్లిపాయని తినేవారు.డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కూడా ఎంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.ఇంత మంచి గుణాలున్న ఉల్లిని రోజు మీ ఆహారంలో తీసుకోవడం మరిచిపోవద్దు.