ఈ టేస్టీ స్నాక్ తింటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు?

Purushottham Vinay
రాగిపిండితో రొట్టె, సంగటి వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా మనం తయారు చేసుకోవచ్చు.ఇక మనం రాగిపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో రాగి చెక్కలు కూడా ఒకటి. రాగిపిండితో చేసే ఈ చెక్కలు చాలా రుచిగాఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు, ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసి తీసుకోవాలనుకునే వారు ఇలా ఈజీగా రాగిపిండితో చెక్కలను తయారు చేసి తీసుకోవచ్చు.అలాగే వీటిని తయారు చేయడం చాలా సులభం. రాగిపిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



ఇక రాగి చెక్కల తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..వేడి నీళ్లు ముప్పావు కప్పు నుండి ఒక కప్పు, రాగిపిండి  ఒక కప్పు, బియ్యం పిండి  2 టేబుల్ స్పూన్స్, నూనె ఒక టేబుల్ స్పూన్, ఉప్పు  తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి  1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు ఒక రెమ్మ, కారం అర టీ స్పూన్, పసుపు  పావు టీ స్పూన్, వంటసోడా  పావు టీ స్పూన్, వేయించి ముక్కలుగా చేసిన పల్లీలు  కొద్దిగా తీసుకోవాలి.



రాగి చెక్కల తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో బియ్యంపిండి, నూనె వేసి కలపాలి. తరువాత ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇంకా వంటసోడా వేసి కలపాలి.ఆ తరువాత వేడి నీళ్లు పోస్తూ గంటెతో కలుపుకోవాలి. తరువాత చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఆ తరువాత పల్లీలు వేసి కలపాలి. ఇప్పుడు బటర్ పేపర్ ను తీసుకుని దానిపై నూనె వేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి.



ఇక ఆ తరువాత పిండిని తీసుకుని బటర్ పేపర్ మీద వేసి చెక్క అప్పలాగా వత్తుకోవాలి. ఆ తరువాత వీటిని మరో బటర్ పేపర్ మీద వేసి పక్కకు ఉంచాలి. తరువాత ఇలా అన్నింటిని వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఆ తరువాత అప్పాలను వేసి వేయించాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే రాగి చెక్కలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. ఇక రాగిపిండితో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: