ఆపరేషన్ సమయంలో.. డాక్టర్లు ఎందుకు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారో తెలుసా?
ఎందుకంటే ఇక ఇలాంటి దుస్తులు డాక్టర్లు వేసుకున్నప్పుడు చూసినప్పటికీ దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం ఎందుకు డాక్టర్లు ఎక్కువగా ఇలాంటి దుస్తులను ధరిస్తారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. ఇక ఆ వివరాలు చూసుకుంటే ఆకుపచ్చ లేదా నీలం రంగు వల్ల సర్జన్ చూసే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎరుపు రంగును మరింత సున్నితంగా చేస్తాయట. ఇలా ఆకుపచ్చ వస్త్రం శస్త్ర చికిత్స సమయంలో కళ్ళను సడలిస్తుందట.
అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల శాస్త్ర చికిత్స సమయంలో డాక్టర్లు నీలం లేదా తెలుపు రంగు యూనిఫాంలో ధరించడం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తేనే ఎంతో మంచిదట. రక్తపు మరకలు గోధుమరంగలో కనిపిస్తాయి. గతంలో తెల్లని దుస్తువులు ధరించే సాంప్రదాయం ఉండేదట. ఇక ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించే సాంప్రదాయం మొదటి నుంచి లేదట. మొదటి నుంచి వైద్యులు తెలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉండగా.. 1914 తర్వాత వైద్యులు తెలుపు రంగును ఆకుపచ్చ రంగుగా మార్చారట. ఇక అప్పటినుంచి వైద్యులందరికీ కూడా ఆకుపచ్చ దుస్తువులు ధరించడం అనేది డ్రెస్ కోడ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆసుపత్రిలో ఎక్కడ చూసినా ఇలా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన డాక్టర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.