చెడు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే వ్యాధులను ఇలా తగ్గించండి?

Purushottham Vinay
శరీరంలో కనుక అనారోగ్య సమస్యలుంటే.. తప్పకుండా వాటి ప్రభావం అనేది బాహ్య చర్మంపై పడుతుంది. ఇంకా అంతేకాకుండా అవయవాలపై కూడా కొంత ప్రభావం అనేది చూపుతుంది.అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అనేది పెరిగినప్పుడు పలు రకాల బాహ్య శరీరంపై పలు రకాల మార్పులు, ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే వివిధ లక్షణాలు ఇంకా సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇవీ అనారోగ్య సమస్యలకు హెచ్చరికలని.. ఈ సంకేతాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యలను సంప్రదించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు పాదాలలో తిమ్మిర్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇంకా అంతేకాకుండా కదలిక సమస్యలు కూడా నిలిచిపోతాయి.ముఖ్యంగా పాదాలపై రంగు మారడం వంటి సమస్యలు చాలా ఉత్పన్నమవుతాయి.


ఇంకా అలాగే ఈ చెడు కొలెస్ట్రాల్ కారణంగా కాళ్ల సిరల్లో కూడా రక్తప్రసరణ సరిగా జరగదు. అంతేకాకుండా కొంత మందిలో ఆక్సిజన్ కూడా సరిగా అందదు. అటువంటి పరిస్థితిలో పాదాలలో నొప్పి అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది.ఇంకా అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ప్రభావం గోళ్లపై పడుతుంది. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ సిరలను నిరోధించడం వలన మొదలవుతుంది. దీని కారణంగా బాడీలో వివిధ ప్రదేశాలకు రక్తప్రసరణ అనేది అగిపోతుంది. దీంతో మీ గోళ్లు కూడా పసుపు రంగులోకి మారుతుంది.కాబట్టి కచ్చితంగా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ఇక ధూమపానం అలవాటు ఉన్నవారు తప్పకుండా డాన్ని మానేయండి.ఇంకా అలాగే తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోండి.అలాగే జంక్‌ ఫుడ్‌ ఇంకా ఆయిల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి.ఖచ్చితంగా ప్రతి రోజూ కూడా వ్యాయామం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: