మహిళలు ఎక్కువ సేపు పనిచేస్తే ఈ సమస్యలు తప్పవు?

Purushottham Vinay
మహిళలు ఎక్కువ సేపు పనిచేస్తే ఈ సమస్యలు తప్పవు.. ఇక నేటి కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే ముందున్నారు. ఇంట్లో మంచి గృహిణిగా బయట ఉద్యోగినిగా కూడా మల్టీ టాస్కింగ్ వర్క్ అనేది వారు చేస్తుంటారు.ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ పని చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ పని చేయడం వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పనిభారం శారీరక ఇంకా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మహిళలు ఆరోగ్యానికి సంబంధించిన నష్టాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ కాలం పనిచేసే మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎక్కువ సేపు పనిచేయడం వల్ల మహిళల్లో పీరియడ్స్ అనేది సక్రమంగా రాదు. అధిక పని కారణంగా స్త్రీలలో క్రమరహిత పీరియడ్స్ సమస్య రావొచ్చు. శారీరక ఇంకా మానసిక ఆరోగ్యంతో హార్మోన్లు ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందువల్ల ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పని గంటలను ఖచ్చితంగా తక్కువ చేసుకోవాలి. అవసరమైన గంటల కంటే ఎక్కువ పని చేయడం ఖచ్చితంగా మానుకోవాలి. 


అంతేకాదు పెరిగిన పనిభారం కారణంగా స్త్రీలు చర్మం ఇంకా అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.ఈ పరిస్థితిలో మీరు జుట్టు రాలే సమస్య నుంచి ఈజీగా బయటపడాలనుకుంటే ఒత్తిడిని తగ్గించుకోండి. ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఇది కాకుండా మీ పని సమయాన్ని కూడా సరిదిద్దండి. మీ కోసం కూడా కొంత సమయం అనేది కేటాయించండి. చాలా మంది మహిళలు ఇంటి ఇంకా ఆఫీసు పనిని నిర్వహిస్తారు. దీని కారణంగా వారు డిప్రెషన్ సమస్యలను కూడా కలిగి ఉంటారు. దీనివల్ల ఇతర శారీరక సమస్యలు కూడా ఎక్కువగా రావచ్చు. మీరు డిప్రెషన్ లక్షణాలను చూసిన వెంటనే పని చేసే విధానాన్ని మార్చుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: